హైదరాబాద్

జలమండలి ఎస్టీపీల నిర్వహణపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జలమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్టీపీల సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు రానున్న రోజుల్లో కొత్త ఎస్టీపీల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను సంబంధించి ఉన్నాతాధికారుల సమీక్ష ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిషోర్.. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 14 ఎటపీలు, 16 ఐఅండ్‌డీల పనితీరుపై ఆరా తీశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్టీపీలను సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేల చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంపు, ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్టీపీల నిర్వహణ యాజమాన్యాలు, జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఎస్టీపీల పనితీరు, కార్మికుల హాజరును తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. ఎస్టీపీలున్న ప్రాంతంలో వినియోగంలేని ఖాళీ స్థలంలో హరితహారంలో భాగంగా సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈలపారు. సమావేశంలో ఈడీ ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ బీ.శ్రీ్ధర్, రెవెన్యూ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి , ఎస్టీపీల నిర్వాహణ రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.