హైదరాబాద్

అంతా ఎలక్షన్ డ్యూటీల్లోనే బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని కోటి మంది జనాభాకు అత్యవసర, పౌరసేవలను అందించే జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లు ఈ సారి ముందుకు సాగటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఎన్నికల విధుల్లేకుండానే కలెక్షన్ వన్ పాయింట్ ప్రొగ్రామ్‌గా రూ.1400 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకోగా, అందులో రూ. 1326 కోట్ల మేరకు పన్ను వసూలు చేసుకున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ. 1500 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్ పెట్టుకోగా, పన్ను కలెక్షన్ ముమ్మరంగా సాగే ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలలైన డిసెంబర్ నుంచి మార్చి వరకు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో జీహెచ్‌ఎంసీతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం బీజీగా ఉండటం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలు ముగిసిన వెంటనే పన్ను కలెక్షన్‌ను ముమ్మరం చేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తుండగానే మళ్లీ పార్లమెంటు ఎన్నికల నగరా మోగటంతో బల్దియా అధికారులు కలెక్షన్‌పై దృష్టి సారించకలేపోతున్నారు. కానీ ఎప్పటికపుడు బల్దియా కమిషనర్ దాన కిషోర్ ట్యాక్సు, ట్యాక్సు యేతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో నేరుగా, టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షలు నిర్వహించినా, కలెక్షన్ మెరుగుపడటం లేదు. ఈ సంవత్సరం రూ. 1500 కోట్ల కలెక్షన్ లక్ష్యంగా పెట్టుకోగా, ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ. 1100 కోట్లు మాత్రమే వసూలైనట్లు అధికారులు తెలిపారు. కనీసం ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లోనైనా పన్ను కలెక్షన్‌ను ముమ్మరం చేయాలని భావించినా, ఎన్నికల విధులు కూడా ఊపందుకోవటంతో ఒకవైపు ఎలక్షన్, మరోవైపు ట్యాక్సు కలెక్షన్ విధులతో క్షేత్ర స్థాయి సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో బకాయిదారులు తామంతట తాము ముందుకొచ్చి బకాయిలను చెల్లించేందుకు వీలుగా పన్ను సంబంధిత ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఆదివారం అన్ని సర్కిళ్లలో ప్రాపర్టీ పరిష్కారం పేరుతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రహసనంగా మారింది. సెలవు రోజైన ఆదివారం అధికారులు మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కేవలం ఫిర్యాదులను స్వీకరిస్తున్నారే తప్పా, వాటిని పరిష్కరించుకుండా పక్కన బెడుతున్నందునే ఫిర్యాదులు పరిష్కారం గాక, కలెక్షన్ మెరుగుపడటం లేదని కొందరు ట్యాక్సు సంబంధిత సిబ్బంది బహాటంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్ విధులతో పాటు కలెక్షన్ విధులను కూడా తప్పకుండా నిర్వర్తించాల్సిందే! లేని పక్షంలో బాధ్యులను చేసి, అవసరమైతే సర్వీసు రికార్డుల్లో రిమార్క్స్ కూడా రాస్తామని కమిషనర్ అల్టిమేటం జారీ చేసినా,కలెక్షన్ మెరుగుపడటం లేదు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు ఎన్నికల విధుల్లో తలమునకలైన తాము కలెక్షన్ విధులెలా నిర్వహిస్తామని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.