హైదరాబాద్

తప్పుడు సర్వే నెంబర్లతో జీహెచ్‌ఎంసీ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : షేక్‌పేట మండలం షేక్‌పేట గ్రామ సర్వే నెంబర్ 129/52లో జిహెచ్‌ఎంసీ లేఔట్ మంజూరుకు రూ.14.50 లక్షల ఫీజు వసూలు చేసిందని, తీరా ఇదే స్థలాన్ని తప్పుడు సర్వే నెంబర్లతో మరి కొంతమందికి అనుమతులు ఇచ్చిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బి.పృథ్విరాజ్ రెడ్డి అనే బాధితుడు ఆరోపించారు.
శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షేక్‌పేట మండలంలో లేని సర్వే నెంబర్ 129/68(పైకి)తో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో వేమిరెడ్డి ఎన్‌క్లేవ్ పేరుతో వేమిరెడ్డి నర్సింహా రెడ్డి అనే వ్యక్తి కౌశిక్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటుచేసి నిర్మాణాలు చేపడుతున్నారని, బోగస్ సర్వే నెంబర్లతో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే జీహెచ్‌ఎంసీ పరిశీలించకుండా ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. లేఔట్ కోసం తన వద్ద ఫీజును వసూలు చేసిన జీహెచ్‌ఎంసీ బిల్డింగ్ నిర్మాణాలకోసం మరో వ్యక్తి చేసుకున్న దరఖాస్తులకు వేమిరెడ్డికి అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల తాను సమాచార హక్కు చట్టం కింద ఈ స్థల వివాదంపై సమాచారం కోరగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం 129/68 (పైకి) అసలు షేక్‌పేట మండల పరిధిలోనిదే కాదని స్వయంగా కలెక్టర్ సమాధానం ఇచ్చారని వివరించారు. బోగస్ సర్వే నెంబర్లతో ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడంతోపాటు ప్రభుత్వ విభాగాలను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వెరిఫికేషన్ ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నది సర్వే నెంబర్ 129/51, 129/52 వరకు మాత్రమే అని పేర్కొన్నట్లు ఆయన వివరించారు.