హైదరాబాద్

ఓఆర్‌ఆర్‌కు విస్తరించిన జలమండలి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని జలమండలి ఇంజనీర్స్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఇంజనీర్స్ సంఘం ఆధ్వర్యంలో వరల్డ్ వాటర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ఒకపుడు హైదరాబాద్ ప్రధాన నగరానికి పరిమితమైన జలమండలి మంచినీటి సరఫరా సేవలు నేడు ఓఆర్‌ఆర్ వరకు విస్తిరించినట్లు పేర్కొన్నారు. దీంతో మంచినీటి సరఫరాకు సంబంధించి పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని, దీన్ని సమర్దవంతంగా ఎదుర్కునేందుకు ఇంజనీర్లు సమయత్తం కావాలని అన్నారు. ఓఆర్‌ఆర్ వరకు సేవలు అందించనున్న నేపథ్యంలో పలు ఉవాళ్లు ఎదురవుతాయని, వాటిని అదిగమించడానికి తీవ్రంగా కృషిచేయాల్సి వస్తుందని సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు డైరెక్టర్లు ఎం.ఎల్లాస్వామి, డీ.శ్రీ్ధర్ బాబు, బీ.విజయ్ కుమార్ రెడ్డి, ప్రవీన్ కుమార్, పీ.రవి తదితరులు ప్రపంచ వాటర్ డే వేడుకల్లో తమ అనుభవాలను తోటి ఇంజనీర్లతో పంచుకోవడంతో పాటు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, రాజేందర్, వెంకట్ రెడ్డి, స్ఫూర్తి, శీరిష ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆకట్టుకుంది.