హైదరాబాద్

మానవళి మనుగడకు సంగీతం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : మానవాళి మనుగడకు సంగీతం అవసరమని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. జీ ఎస్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వకుళాభరణం కృష్ణ మోహన రావుమాట్లాడుతూ ప్రతిరోజు అనేక మానసిక ఒత్తిడులతో ఉండే ప్రజలు సంగీత, గాన శ్రవణంతో మానసిక ప్రశాంతతను పొందడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు జీ.శ్రీనివాస్ నిర్వహణలో గాయనీ, గాయకులు అరుణ రాగరేఖ, మాధవి, అనురాధ, గోవింద లక్ష్మీ, రవిమన్యు, బైరి శ్రీనివాస్, ఏవీ రమణ అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో సామాజికవేత్త డా.కొత్తకృష్ణవేణి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, దైవజ్ఞ శర్మ, రాధాకృష్ణ పాల్గొన్నారు.
మే13న వైటథాస్ రన్
హైదరాబాద్, మార్చి 22: వైటథాస్ అనేది పిల్లలలో ప్రాణహాని కలిగించే ఒక కంటి క్యాన్సరయిన రెటినోబ్లాస్టోమాలో అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి తెల్లబింబంగురించిన అవగాహనను పెంచడనాకి వైటథాస్ పేరుతో రన్‌ను నిర్వహిస్తోంది. ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఇఇ) కంటి వ్యాదులపై పూర్తి స్థాయి అవగాహాన కల్పించేందుకు గాను రెండవ రన్‌ను మే 19న వీవీఎస్ లక్ష్మణ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నిర్వహించనుంది. వార్షిక ప్రపంచ రెటినోబ్లాస్టోమా అవగాహనా వారంలో ఒక భాగం. రన్‌లో దాదాపు ఐదువేల మంది పాల్గొనే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు. కేవలం భారత దేశంలోనే ప్రతి సంవత్సరం 1500 కొత్త పీడియాట్రిక్ రెటినోబ్లాస్టోమా కేసులు గుర్తించడం జరుగుతుందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో కంటి క్యాన్సర్ నిపుణులు, ఆపరేషన్ ఐసైట్ యూనివర్సల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఐ కాన్సర్ అధిపతి డాక్టర్ స్వాతి కలికి తెలిపారు.

వాక్‌థాన్ రన్ విజయవంతం
హైదరాబాద్, మార్చి 22: ప్రపంచ వాటర్ దినోత్సవం సందర్భంగా జలమండలి, జల వరసత్వ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నీటి పరిరక్షణ కోసం ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు వక్‌థాన్ రన్ నిర్వహించారు. కేబీఆర్ పార్క్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు వరకు రన్‌ను నిర్వహించారు. వాక్‌థాన్‌ను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోక పోతే రానున్న తరాలకు నీటి ఇక్కట్లు తప్పవని చెప్పారు. జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలో పది శాతం వరకు వినియోగదారులు వృథా చేస్తున్నారని వెల్లడించారు. ఈ నీటిని దాదాపు నాలుగు లక్షల మందికి సంబంధించి నీటి అవసరాలు తీర్చవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ, ట్రాన్స్‌మిషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పీ.సత్య సూర్యనారయణ, ఆపరేషన్స్, మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, పీ.రవి పాల్గొన్నారు.