హైదరాబాద్

ఓట్ల డ్యూటీ చేసే వారే ఓటేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఇష్టం లేకపోయినా అయిష్టంగానే డ్యూటీలు చేసే ఎన్నికల సిబ్బంది తమకిచ్చిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ వేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని హైదరాబాద్ పరిధిలోని సికిందరాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో రిజర్వు స్ట్ఫాతో కలిపి సుమారు 30వేల మంది ఎన్నికల విధులను నిర్వరిస్తున్నారు. వీరిలో 400 నుంచి 500 మంది సిబ్బంది నేటికీ కొరత ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కూడా తాము విధులు నిర్వహిస్తున్న చోటు నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ దాన కిషోర్ నేతృత్వంలో సుమారు 30వేల మందికి పోస్టల్ బ్యాలెట్లను పంపిణీ చేస్తున్నారు. కానీ వీరిలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చటం లేదని తేలింది. ఇటీవల శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో వేల మందికి పోస్టల్ బ్యాలెట్‌లను పంపిణీ చేయగా, అందులో కేవలం 1101 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంటు ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు వివిధ ఇతర అవసరాల కోసం మొత్తం 24వేల మంది సిబ్బంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇరవై శాతం మంది రిజర్వుతో కలిపి మొత్తం సుమారు 30వేల మంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్న చోట నుంచే ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల పంపిణీని ప్రారంభించారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియామక ఉత్తర్వులిచ్చిన తర్వాత పోస్టల్ బ్యాలెట్‌ను పంపిణీ చేసిన జిల్లా ఎన్నికల అధికారులు లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఎన్నికల విధుల కోసం రిపోర్టింగ్ చేస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ఫారాలను అందజేస్తున్నారు.
పరోక్షంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు వెబ్‌కాస్టింగ్, బీఎల్‌ఓలకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ఉన్న అందరికీ ఎస్‌ఎంఎస్‌లను పంపతున్నారు. అంతేగాక, ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు జరిగే కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి ఈ పోస్టల్ బ్యాలెట్ ఫారాన్ని అందించటంతో పాటు ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీని నోడల్ అధికారిగా నియమించి, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చేస్తున్న కృషి ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి!