హైదరాబాద్

రసరంజని ఆధ్వర్యంలో ‘నాటకోత్సవాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: రసరంజని సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేది నుంచి 27తేది వరకు నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణచారి తెలిపారు. శనివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాటకోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి యేటా రసరంజని ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు నాటక వికాసానికి నాటకలు దోహద పడుతాయమని వివరించారు. కేవలం పది రూపాయల ప్రవేశ రుసుమును వసూలు చేసే సంప్రదాయాన్ని ప్రారంభించి ప్రతినెలా ఒక నాటక ప్రదర్శనను ప్రదర్శిస్తు 26 సంవత్సరాలుగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే నాటకోత్సవాలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని ప్రారంభిస్తారని వివరించారు. మొదటి రోజు ‘కార్చిచ్చు, రెండవ రోజు ‘గుప్పెడంత గుండెలో..’ మూడో రోజు ‘కలనేత’ నాటకలను ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. నాటక ప్రియులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకోత్సవాలను విజయవంతం చేయాలని అకాక్షించారు. విలేఖరుల సమావేశంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సంస్థ కార్యదర్శి ముట్నూరి కామేశ్వర రావు పాల్గొన్నారు.