హైదరాబాద్

ఈ-సువిధతోనే ప్రచార అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులు తమ ప్రచార అనుమతుల కోసం ఈ-సువిధ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులివ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పష్టం చేశారు. దరఖాస్తులు కూడా ప్రచారం చేసుకునే సమయానికి 48 గంటల ముందు సమర్పించుకుంటేనే అనుమతి ఇచ్చే వీలుంటుందని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన రెండు పార్లమెంటు స్థానాల రిటర్నింగ్ అధికారులు, పోలీసులతో ఎన్నికల ఏర్పాట్లు, ప్రచార అనుమతులు అంశంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల నిర్వహణను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలన్నింటిని పూర్తి స్తాయిలో వీడియోగ్రఫీ చేయించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఈ నెల 25వ తేదీ అనంతరం ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరిగే అవకాశమున్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బృందాలు, ఎస్‌ఎఫ్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు హైదరాబాద్ జిల్లిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, ఇతర విధానలా ద్వారా వీడియోగ్రఫీ చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9వేల మంది ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంటు ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం పూర్తయిందని, మరో 11వేల మంది ఓపీఓలకు ఆదివారంలోపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్‌లకు ఈ న ఎల 25వ తేదీన శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు సౌకర్యవంతంగా ఉండేలా ర్యాంప్‌ల నిర్మాణాన్ని ఏప్రిల్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్ని స్ట్రాంగ్ రూంల వ ద్ద ఫైర్ సేఫ్టీ పరికరాలు, సీసీ టీవీలు, ఇతర సౌకర్యాలను కల్పించి, సిద్దం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ మాణిక్‌రాజు, జేసీ రవి, నగర అదనపు పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్, అదనపు కమిషనర్లు అద్వైత్‌కుమార్, స్నిక్తా పట్నాయక్, సందీప్ జా, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్‌లు జయరాజ్ కెనడీ, జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, విజయలక్ష్మి హాజరయ్యారు.