హైదరాబాద్

తెలుగు కళలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజ్‌గిరి జడ్జి బూర్గుల మధుసూదన్ అన్నారు. పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ జయంతి సందర్భంగా ‘నటరాజ నృత్య వైభవం’ కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బూర్గుల మధుసూదన్ నట్య గురువులకు ‘నటరాజ కళారత్న’ పురస్కారాలను ప్రదానం చేశారు. తెలుగు సంస్కృతిని రాబోవు తరలకు తెలియజేయాలని అన్నారు. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ చిత్ర యూనిట్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వరి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, వైఎస్‌ఆర్ మూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, నటుడు ఇంద్రనీల్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.