హైదరాబాద్

శివార్లకు తప్పని నీటి తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేసవి కాలం ప్రారంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజల అవసరాలకు తగట్టుగా నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో ఆశించిన రీతిలో నీటి సరఫరా కొనసాగడం లేదు. ఫలితంగా శివార్లలోని అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా కోసం దాదాపు 40 ఎంజీడీల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని 30 ఎంజీడీలు నీటి సరఫరా కోసం వినియోగించుతుండటంతో 10 ఎంజీడీల నీటి సరఫరా కోతపడుతుంది. రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌లో నీటి సమస్యలు తలెత్తున్నాయి. రోజు విడిచి రోజు నీటి సరఫరా ఉండే ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుండడంతో ప్రజలు బోర్లు, వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. భూగర్భ జలాలు ఎండిపోవటంతో బోర్లు కూడా ఎండి పోతున్నాయి. కాలనీ వాసులతో పాటు వివిధ అపార్ట్‌మెంట్‌లకు చెందినవారు.. జలమండలికి చెందిన వాటర్ ట్యాంకర్లపై ఆధారపడి బుక్ చేస్తే రెండు, మూడు రోజులకు రావడంతో ప్రైవేట్ ట్యాంకర్లపై ఆదారపడుతున్నారు. ఫలితంగా ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యాజమానులు ఇష్టం వచ్చిన రేట్లకు ట్యాంకర్లను విక్రయిస్తున్నారు. మంజీరా, సింగూరు జలాల నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకూ నీటిని జలమండలి అందిస్తోంది. తాగునీటి సరఫరా చేసే ప్రాంతాలు పేరగటంతో నీటి సరఫరాలో వ్యత్యాసాలు ఏర్పాడుతున్నాయి. జలమండలి సేవలు విస్తరించిన అందుకు తగ్గట్టు నీటి వనరులు లేకపోవటడంతో నీటి సరఫరా కష్టాతరమైంది. గ్రేటర్ ప్రజల దాహర్తీని తీర్చేందుకు కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 నుంచి దాదాపు 270 ఎంజీడీలు, అదే విధంగా గోదావరి ప్రాజెక్ట్‌ల నుంచి 172 ఎంజీడీలు, మంజీరా నుంచి 45 ఎంజీడీలు, సింగూరు నుంచి 75 ఎంజీడీలు, జంట జలాశాయాలైన ఉస్మాన్ సాగర్ నుంచి 25 ఎంజీడీలు, ఉస్మాన్ సాగర్ నుండి 15 ఎంజీడీలు కలుపుకోని మొత్తం 602 ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేసేది. సింగూరు, మంజీరా జలశాయాలు ఎండిపోవడంతో నీటి సరఫరా నిలిపివేశారు. గ్రేటర్ ప్రజల నీటి అవసరాలకు వినియోగించే 602 ఎంజీడీల నీటి సరఫరాలో ఒకేసారి 120 ఎంజీడీల నీటి కొరత ఏర్పాడింది. ప్రస్తుతం జంట జలాశయాల నుంచి గతంలో 45 ఎండీల నీటిన సరఫరా చేస్తే అందుబాటులో ఉన్న 20 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపు 140 ఎంజీడీల నీటి సరఫరాకు సంబంధించి కోతపడిన్నట్లయింది. జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్‌ఆర్ లోపల గ్రామాలకు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మంచి నీటి అవసరాలకు గోదావరి నుంచి మిషన్ భగిరథ ప్రాజెక్ట్ కింద అదనంగా మరో 40 ఎంజీడీల నీటి రింగ్ మెయిన్-1 కింద తీసుకువస్తున్నారు. మంజీరా, సింగూరు నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్ పడింది. శేరిలింగంపల్లిలో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు దాదాపు కోటి రూపాయల వ్యయంతో తేజాపూర్, నలగండ్ల, గోపనపల్లి, వట్టినాగులపల్లి, గౌడిదొడ్డి వంటి గ్రామాల్లో జంక్షన్, ఇంటర్ కనెక్షన్‌లకు సంబంధించిన పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతోంది. గోదావరి నుంచి రింగ్ మెయిన్-1తో తీసుకువస్తున్న నీటి సరఫరాను పటాన్‌చెరువు వరకు మళ్లించారు. ఆయా గ్రామాల్లో నీటి సరఫరాకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరాను అధికారులు తగ్గిస్తున్నారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 196 గ్రామాలకు రూ.700 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్ పనులను జలమండలి చేపడుతోంది. 125 రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా దాదాపు 85 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. అనేక గ్రామాల్లో నీటి సరఫరాకు సంబంధించిన పైప్‌లైన్ పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్లు అందుబాటులో ఉన్న నింపడానికి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు నీటి సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు రెట్టింపు చార్జీలు చెల్లించి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న నీరు సరిపడ రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జలమండలి ఆధ్వర్యంలో దాదాపు 1200పైగా వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. వీటిలో 600 వరకు ఉచిత ట్యాంకర్లతో దాదాపు ప్రతి రోజు మూడు వేల వరకు ట్రిప్పులు నడుపున్నామని, 525 వరకు పేమెంట్ ట్యాంకర్లను అందుబాటులో ఉన్నాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అదనంగా మరో వంద ట్యాంకర్లను అందుబాటులోకి తేస్తున్నామని జలమండలి ఉన్నాతాధికారులు ప్రకటించి ఇంతవరకు ఆచరణకు నోచుకోకపోవడం శోఛనీయం. గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న రిజర్వాయర్ల వద్ద అదనంగా మరో 20 ఫిల్లింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని జలమండలి ప్రకటించిన అది కేవలం కాగితాలకే పరిమితమైంది. నీటి సమస్యలు మరింత తీవ్రతరం కాకాముందే జలమండలి అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.