హైదరాబాద్

ఆ రూటు.. యమ డేంజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ప్రాజెక్ట్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. మూడు కారిడార్లలో కారిడార్-2 మినహా మిగిలిన రెండు కారిడార్లను ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సికిందరాబాద్ జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు ఏర్పాటు చేయనున్న మూడో కారిడార్‌లో మెట్రోరైలు పనులు నత్తనడకన సాగటంతో పాటు ఈ రూట్‌లో ప్రయాణించేందుకు వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. అత్యధికంగా రద్దీ ఉండే జేబీఎస్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావటం, పలు చోట్ల ఇరుకుగా మారటంతో పాటు రాత్రిపూట వీది ధీపాలు వెలగకపోవటంతో ఈ రూట్ ప్రమాదకరంగా మారింది. మెట్రోరైలు కోసం స్థల సేకరణ ప్రక్రియను ఏళ్ల క్రితం చేపట్టినా, నేటికీ పూర్తి కాలేదు. ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఇంకా కొన్ని ఆస్తుల నుంచి స్థలాల్ని సేకరించాల్సి ఉంది. కానీ, ఎలాగో మెట్రోరైలు పనులు జరుగుతున్నాయని అధికారులు ఈ రూట్‌లో రోడ్డు వేయటం మర్చిపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ పేరిట ముషీరాబాద్ చౌరస్తా సిగ్నల్‌ను మూసివేయటంతో పద్మారావునగర్, వారాసిగూడ వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ముషీరాబాద్ చౌరస్తా నుంచి భోలక్‌పూర్ మీదుగా సికిందరాబాద్ వైపు రావాలంటే చౌరస్తా నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత రోడ్డు మొత్తం ఇరుకుగా మారటంతో ఉదయం, సాయంత్రం ఆఫీసు వేళల్లో వాహనాలు క్యూ కడుతున్నాయి. గాంధీ ఆసుపత్రి ముందున్న ఈఎస్‌ఐ ఆఫీసు వద్ద కూడా రోడ్డు ఇరుకుగా మారటంతో వాహనదారులకు, రోడ్డు దాటే పాదచారులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు కూడా వాహనదారుల ఇబ్బందులు వర్ణణాతీతం. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు వచ్చే వాహనాలు నారాయణగూడ వైపు వేళ్లే వాహనాలకు రైట్ టర్న్‌ను మూసివేశారు. నారాయణగూడ చౌరస్తా నుంచి సుల్తాన్‌బజార్ బడీచౌడీ మీదుగా కోఠి వైపు వెళ్లాలంటే వాహనదారులు చుక్కలు చూడాల్సిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ముషీరాబాద్ మీదుగా సికిందరాబాద్ వచ్చే రూట్‌లో పలు చోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలుండట, వీధిదీపాలు వెలగక అంధకారం నెలకొనటంతో వాహనదారులకు గుంతలు కన్పించక పలువురు ప్రమాదాల పాలైన ఘటనలు సైతం నెలకొన్నాయి. ఈ రూట్‌లో మెట్రోరైలు పనులు పూర్తయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశమున్నందున, అప్పటి వరకు వాహనదారులు సౌకర్యార్థం వీధిదీపాలు వెలిగేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.