హైదరాబాద్

అంతా బిజీ..బీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థకు చెందిన ఏ ఆఫీసుకు వెళ్లినా, సందర్శకులకు నిరాశే ఎదురవుతోంది. కనీసం బర్త్, డెత్ సర్ట్ఫికెట్లతో పాటు ఏ ఇతర పనులపై వెళ్లినా, అధికారులు అందుబాటులో లేకపోవటంతో ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, పోలింగ్ స్టేషన్ల వద్ద వౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై బిజీగా ఉన్న బల్దియా సిబ్బంది మున్ముందు మరింత తలమునకలయ్యే పరిస్థితి నెలకొంది. నామినేషన్ల సమర్పణ సోమవారంతో ముగియటంతో ఇక అభ్యర్థులు ప్రచారానికి వెళ్లే అవకాశముండటంతో ప్రతి అభ్యర్థి ప్రచార తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అభ్యర్థులకు ప్రచార అనుమతులనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ-సువిధ అప్లికేషన్ అమలు చేస్తూ, 48 గంటల ముందే వారికి అనుమతులిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల హడావుడి పెరిగింది. నిన్నమొన్నటి వరకు ఈవీఎంల మొదటి దశ తనిఖీలు..ఓటర్లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వినియోగంపై అవగాహన, ఏర్పాట్లపై సమీక్షలు, సమావేశాల్లో బీజీగా ఉన్న అధికారులు రెండో దశ ఈవీఎంల తనిఖీలకు సిద్దమవుతున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల సంబంధిత విధుల్లో అన్ని క్యాటగిరీల అధికారులు తలమునకలయ్యారు. ఎన్నికల సిబ్బందికి ఆదివారం కూడా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారంటే జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఏ స్థాయిలో తలమునకలయ్యారో అంచనా వేయచ్చు. ముఖ్యంగా సర్కిళ్లు, జోన్ల ఆఫీసులకు వివిధ పనులపై వచ్చే సందర్శకులకు అధికారులు అందుబాటులో లేకపోవటంతో, తమ ఫిర్యాదులు ఎవరికి సమర్పించుకోవాలో తెలీక సందర్శకులు నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు, ఆ సమయంలో ఎన్నికల విధుల్లో ఉండటం, అసలు ఆఫీసుకు వస్తారా? లేదా? అన్న అంశంపై అక్కడి సిబ్బంది సందర్శకులకు సరైన సమాధానం చెప్పక మరింత అయోమయానికి గురి చేస్తున్నట్లు పలువురు సందర్శకులు వాపోతున్నారు. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటే కనీసం ప్రజల నుంచి ఫిర్యాదులు, ఆర్జీలను స్వీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సందర్శకులు కోరుతున్నారు.