హైదరాబాద్

సామాజిక స్థితిగతులకు అద్దం పట్టిన నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన మాయ కళ్లజోడు, కొక్కొరొకో నాటికలు వర్తమాన, సామాజిక స్థితిగతులకు అద్దం పట్టాయి. దర్శకుల, నటుల ప్రతిభను చాటిచెప్పాయి. మాయ కళ్లజోడు పెట్టుకుని చూస్తున్నామని, దొంగ వేషాలన్నీ కన్పిస్తున్నాయని ఇంటి యజమానులు, పనిమనిషి పరస్పరం బ్లాక్‌మెయిల్ చేయడం ఈ నాటికలో ప్రధాన ఇతివృత్తం. ఎదుటివాళ్లను మోసం చేయాలనుకుంటే తామే మోసపోక తప్పదనే సందేశంతో సాగిన ఈ హాస్య నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. బెల్లంకొండ రామదాసు రచించిన నాటికకు అమర్ సాధనాల దర్శకత్వం వహించగా భానుప్రకాష్, రుక్మిణి, అజయ్ వివిధ పాత్రలు ధరించారు. తనికెళ్ల భరణి రచించిన ప్రసిద్ధమైన కొక్కొరొకో నాటికను కె.కిరణ్‌కుమార్ దర్శకత్వంలో భానుప్రకాష్, శ్రీకాంత్ ప్రదర్శించారు. నిరుద్యోగ సమస్యతో విసిగివేసారిన ఇద్దరు యువకుల మధ్య సాగిన మానసిక సంఘర్షణ ఈ నాటిక ప్రధాన ఇతివృత్తం.
నిస్పృహకు లోనై ఎంతటి అఘాయిత్యానికైనా పూనుకునే తెగువ కలిగిన యువత కొందరు, ఎంతటి పరిస్థితులు ఏర్పడినా సహనం వీడని ఆశావహ భవిష్యత్తు కోసం ఎదురుచూసే యువత కొందరు ఉంటారనే సందేశాన్ని ఇస్తుంది. రంగస్థల కళలశాఖ అధ్యక్షురాలు డా. బిహెచ్ పద్మప్రియ పర్యవేక్షించారు.