హైదరాబాద్

అంబరాన్నంటిన అంబేద్కర్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారతరత్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మహానగరంలో ఆదివారం అంబరాన్నంటాయి. జయంతి ఉత్సవాలకు ప్రధాన వేదికైన ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక జయంతి ఉత్సవాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపులు భారీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. నగరంలోని అహ్మద్‌నగర్ డివిజన్‌లోని నెహ్రూనగర్‌లోని అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ. రాములు, జనరల్ సెక్రటరీ జీ. బాబురావు నేతృత్వంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఊరేగింపు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వేల్ఫేర్ అసోసియేషన్ నేతలు విజయకుమార్, జైపాల్, రవితేజ, పార్వతీ, సునీత పాల్గొన్నారు. నగరంలోని చింతల్‌బస్తీ సమీపంలోని వీర్‌నగర్, మల్లేపల్లి సమీపంలోని గోకుల్‌నగర్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మరికొన్ని చోట్ల బాబాసాహెబ్ జయంతిని పురస్కరించుకుని అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే తెల్లవారుఝాము నుంచే ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రముఖులు, దళిత సంఘాల నేతలు చేరుకుని నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఊరేగింపులు మరింత ఊపందుకున్నాయి. లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.
దళితుల సమగ్రాభివృద్ధికి కృషి
హైదరాబాద్: దళితుల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నాతాధికారులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేపట్టిన సంస్కరణలు, సేవలు మారువలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యంగ విలువలను కాపాడుతూ నవ సమాజ నిర్మాణం కోసం నాంది పలకాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్, నగర్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు కమిషనర్లు చౌహన్, అనిల్ కుమార్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ భుక్యా పాల్గొని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఖైరతాబాద్: రాజ్యాంగ నిర్మాత డార్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. వర్ణవ్యవస్థతో బడిలోకి అనుమతించకపోతే పాఠశాల వెలుపలే ఉండి ఉపాధ్యయులు చెప్పే పాఠాలను నేర్చుకొని దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించే స్థాయికి ఎదిగారని కొనియాడారు.