హైదరాబాద్

శోభాయమానంగా శ్రీరాముడి శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకుని నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శోభాయాత్ర ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శోభాయాత్ర కొనసాగిన నగర విధులు ‘జై శ్రీరామ్, జై భారత్ మాతా ’ అంటూ నినాదాలతో హోరెత్తాయి. శోభాయాత్ర కొనసాగే రూట్‌లో 192 ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అడుగడుగునా పోలీసులను నియమించారు. పోలీసు బందోబస్తులో నగరానికి చెందిన 18వందల మంది పోలీసులతోపాటు వివిధ జిల్లాలకు చెందిన పోలీసు బలగాలు కూడా విధుల్లో పాల్గొన్నారు. శోభాయాత్రను ఎప్పటికపుడు వీక్షించేందుకు బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూంనుంచి పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఆదివారం సీతారామ్‌బాగ్‌లోని దేవాలయం నుంచి ప్రారంభమయిన శోభాయాత్ర సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, జాలిహనుమాన్, దూల్‌పేట్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్ ఛత్రి, పుత్ల్లీబౌలి క్రాస్ రోడ్డు, కోఠి, సుల్తాన్ బజార్, గౌలిగూడ మీదుగా హనుమాన్ వ్యాయామశాల పబ్లిక్ స్కూల్ వరకు కొనసాగింది. శోభాయాత్ర నగరవాసులు డప్పు వాయిద్యాలతో పాటు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రోడ్లన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శోభాయాత్రను తిలకించేందుకు నగర, శివారు ప్రాంతాల నుంచి అనేకమంది రావడంతో శోభాయాత్ర రూట్ జనంతో కిక్కిరిసిపోయింది. ర్యాలీలో గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఆటా పాటాలతో హోరెత్తించారు. శోభాయాత్ర ప్రశాంతంగా శోభాయమానంగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నగర పురవీధులన్నీ కాషాయజెండాలతో హోరెత్తాయి. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడంతో నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఈ సందర్భంగా శాంతి భద్రతలను సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు.