హైదరాబాద్

మెట్రో స్టేషన్లలో పార్కింగ్ పరేషానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రోరైలు స్టేషన్లలో కనీస వసతులు కరవయ్యాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు మెట్రోరైలు తమకెంతో ఉపయోగపడుతుందని భావిస్తున్న నగరవాసులు ఎంతో ఉత్సాహగా మెట్రో స్టేషన్‌కు వచ్చిన తర్వాత, వారి వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియక నిరుత్సాహం వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. నగరంలోని మూడు మెట్రో కారిడార్లలో 66 మెట్రో స్టేషన్లను నిర్మించారు. కానీ అందులో ఏ ఒక్క మెట్రో స్టేషన్‌లోనూ వాహనదారుల సంఖ్యకు తగిన స్థాయిలో పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవటంతో మెట్రోను వినియోగించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు ఎక్కువ ఆసక్తి కనబర్చటం లేదు. మొట్ట మొదటిసారిగా మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు అందుబాటులోకి వచ్చిన మెట్రో కారిడార్‌లో మొదటి రోజే ప్రయాణించిన వారి వాహనాలకు పోలీసులు చలానాలు విధించిన సంగతి తెలిసిందే! ఈ ఘటన చోటుచేసుకుని ఏడాదిన్నర పూర్తయినా, అధికారులు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించటంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కారిడార్లలో నిత్యం రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు అమీర్‌పేట, హబ్సిగూడ, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్ తదితర స్టేషన్లలో ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ అందుబాటులో లేదు. పైగా తార్నాక, హబ్సిగూడ, మెట్టుగూడ స్టేషన్లలో నలభై నుంచి యాభై ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఒక వైపు, పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై చాలీచాలని పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. కానీ ఉదయం తొమ్మిది దాటిన ఆ యార్డు నిండిపోవటంతో మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన వాహనదారులకు తమ బండిని ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉప్పల్ నుంచి మెట్రోరైలులో హైటెక్ సిటీ వెళ్లేందుకు బయల్దేరిన ఓ ద్విచక్ర వాహనదారుడికి ఉప్పల్ స్టేషన్‌లో పార్కింగ్ అందుబాటులో లేకపోవటంతో హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించి, అక్కడ కూడా ప్లేస్ లభించలేదు. ఈ రకంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో వాహనదారులు మెట్రోలో ప్రయాణించాలన్న ఆసక్తి ఉన్నా, పార్కింగ్ లేక వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్ అండ్ టీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మెట్రో స్టేషన్ల ఆవరణలో ఏర్పాటుచేసే పార్కింగ్ యార్డులో ఇష్టారాజ్యంగా చార్జీలను వసూలు చేస్తున్నా, కనీసం వాహనదారుడికి అక్కడ తాగునీరు, టాయిలెట్ వంటివి అందుబాటులో లేకపోగా, వాహనానికి వాహనదారుడిదే సొంత బాధ్యత అని టోకెన్‌పై ముద్రించటం మెట్రోరైలు అధికారులు కల్పిస్తున్న సేవలకు నిదర్శనం. ద్విచక్ర వాహనానికి తొలి రెండు గంటలు రూ.4, ఆ తర్వాత ప్రతి అదనపు గంటకు రూ. 2 చొప్పున, అలాగే త్రీ వీలర్‌కు అయితే రూ. 10, ఆ తర్వాత ప్రతి అదనపు గంటలకు రూ. 5ను వసూలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మెట్రో స్టేషన్లలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన పార్కింగ్ యార్డుల్లో ద్విచక్ర వాహనానికి రోజుకి రూ. 10, త్రీ వీలర్‌కు రోజుకి రూ. 20 వరకు ఏకంగా వసూలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న పనులపై ప్రయాణించి, తిరిగి గంట నుంచి గంటన్నరలోపు తిరిగి వచ్చే ప్రయాణికులు ఈ రకమైన వసూళ్లతో తమకు నష్టం జరుగుతుందని, రెండు గంటల పార్కింగ్‌కు రూ. 4 వసూలు చేయాల్సి ఉండగా, ఎందుకు తాము రూ.10 చెల్లించాలని కొందరు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎంత సేపు పార్కింగ్ చేసినా, ఒక రోజు చార్జీలను వసూలు చేయటం ఎంత వరకు న్యాయమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.