హైదరాబాద్

‘నాట్య సౌందర్య’ పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అందాల నటి సౌందర్య 15వ వర్దంతి సందర్భంగా నృత్య గురువు పోలవరపు శిరీషకు ‘నాట్య సౌందర్య’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గాసభలోని గుండవరపు హనుమంత రావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. సౌందర్య అనేక కుటుంబ కథ చిత్రల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ, వైఎస్‌ఆర్ మూర్తి, నటుడు జెన్నీ పాల్గొన్నారు.
క్లాట్‌లో ఉచిత శిక్షణ
కాచిగూడ, ఏప్రిల్ 17: రానున్న క్లాట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని మావర్ 30 అకాడమీ ఫర్ క్లాట్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేది నుంచి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని సంస్థ ప్రతినిధులు డీవీ రావు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా ట్రైనింగ్ కోర్సులను ఏర్పాటు చేశామని వివరించారు. క్లాట్ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఆస్తకి గల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8688122222ను సంప్రదించాలని కోరారు.
నృత్య గురువు శృతి యాదవ్‌ను ఆదుకోవాలి
కాచిగూడ, ఏప్రిల్ 17: ప్రముఖ నృత్య గురువు శృతి డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ శృతి యాదవ్.. రోడ్డు ప్రమాదంలో గాయపడి చార్మినార్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తలకు బలమైన గాయం తగలటంతో నెత్తురు గడ్డ కట్టిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన శృతి యాదవ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు, సాంస్కృతిక శాఖ, బీసీ కమిషన్‌తో పాటు సాంస్కృతిక సంస్థలు ఆర్థికంగా శృతి యాదవ్‌ను ఆదుకోవాలని ప్రముఖ కూచిపూడి నృత్య గురువు కురుగంటి రాధిక తెలిపారు. మరిన్ని వివరాలకు 9246353614ను సంప్రదించాలని కోరారు.