హైదరాబాద్

నటనపై శిక్షణ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: శిక్షణ పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని అచింత్ కౌర్ డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తండ్రి దిల్‌ప్రీత్ సింగ్ చద్దాతో కలిసి తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించింది. నటనపై ఆసక్తి కలిగిన తాను తల్లిదండ్రుల సమ్మతితో హిమాయత్‌నగర్‌లోని సూత్రధార్ ఇన్‌స్టిట్యూట్‌లో థియేటర్ వర్క్‌షాప్‌లో ఈనెల 3న చేరినట్టు తెలిపింది. కొన్ని రోజులు శిక్షణ సజావుగానే జరిగిందని, ఈనెల 15న ఉదయం శిక్షణ కోసం ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లిన విద్యార్థులందర్నీ ఒక గదిలోకి పిలిచి పూర్తిగా వస్త్రాలు తొలగించాలని సంస్థ డైరెక్టర్ వినయ్ వర్మ ఆదేశించారని తెలిపింది. దీంతో తాను ఆ విధంగా చేసేది లేదని, ఇలాంటివి ఎందుకు చేయాలని ప్రశ్నించానని తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన వినయ్ వర్మ తన ఆదేశాలు పాటించకపోతే వెంటనే బయటకు వెళ్లిపోవడంతో పాటు మరోసారి ఇన్‌స్టిట్యూట్‌కు రావద్దని గెంటివేశారని వాపోయింది. ఈ వ్యవహారాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాగా, వెంటనే షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి అతన్ని పిలిపించి విచారించగా తాను అలా చేయడం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వినయ్ వర్మపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తాము నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు చాలా సమయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన తాము 8 గంటల వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. తాను సేఫ్‌గానే ఆ శిక్షణాలయం నుంచి బయటపడ్డానని, ఇతర యువతులు ఇబ్బందులకు గురి కావద్దన్న లక్ష్యంతో ఫిర్యాదుచేస్తే పోలీసులు ఈ తీరుగా వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శిక్షణ సంస్థలపై దృష్టి సారించాలని కోరారు.