హైదరాబాద్

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. మెగాసీటీ నవ కళా వేదిక, మథర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘డా.బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య విచ్చేసి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖులు ప్రొఫెసర్ డీకే రెడ్డి, డాక్టర్ రవీందర్, లయన్ డా.ఏవీ స్వామి, కే, శ్రీనివాస్ రావు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున రావు, రాఘవ సాయినాథ్ పాల్గొన్నారు.