హైదరాబాద్

లక్ష్యాన్ని అధిగమించాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వర్తమాన ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆస్తిపన్నును ఈ నెలాఖరులోపు ఎర్లీబర్డ్ స్కీం కింద పన్ను చెల్లింపుదారులు సెలవురోజుల్లోనూ చెల్లించవచ్చునని కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ఇందుకు సెలవురోజులైన శుక్ర, ఆదివారాల్లోనూ జీహెచ్‌ఎంసీకి చెందిన సిటిజన్ సర్వీసు సెంటర్లు తెరిచే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎర్లీబర్డ్ పన్ను వసూళ్లు, సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ నినాదంతో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై ఆయన గురువారం ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం ఎర్లీబర్డ్‌లో రూ. 433 కోట్లు పన్ను వసూలైందని, ఈ సారి ఈ నెలాఖరులోపు రూ. 500 కోట్ల వరకు వసూళ్లు చేయాలని ఆదేశించారు. గురువారం నంచి ఈ నెలాఖరు వరకు ప్రతి సెలవు రోజుల్లో సిటిజన్ సర్వీసు సెంటర్లు తెరిచి ఉంచాలని సూచించారు. ఈ కేంద్రాల్లో అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేయటంతో పాటు పన్ను చెల్లింపుదారులకు తగిన వౌలిక వసతులు కల్పించాలని అన్నానరు. నగరంలోని వార్డు కార్యాలయాల్లో బిల్ కలెక్టర్లు అందుబాటులో ఉంచి, ఎర్లీబర్డ్ ఆస్తిపన్నులను స్వీకరించాలని, ప్రతిరోజు పన్ను వసూళ్లపై బిల్ కలెక్టర్ల వారీగా సమీక్షించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి సర్కిల్‌లో ప్రత్యేకంగా ఆటోల ద్వారా ఆస్తిపన్ను చెల్లింపుపై ప్రచారం నిర్వహించటంతో పాటు నగరవాసులకు ఎస్‌ఎంఎస్‌లను పంపాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత సంవత్సరంలోని ఎర్లీబర్డ్‌లో అధిక పన్నులు వసూలు చేయాలని, ఈ విషయమై డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు.