హైదరాబాద్

ఖాళీ స్థలాలకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని ఖాళీ స్థలాలను గుర్తించి, అక్కడ చెత్త పడకుండా చర్యలు తీసుకునేందుకు వీలుగా స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని బల్దియా కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఖాళీ స్థలాల్లో చెత్త వేసే వారిని కూడా గుర్తించి, వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సూచించారు. ఎర్లీబర్డ్ పన్ను వసూళ్లు, సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ నినాదంతో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ పట్టించుకోకుండా ఖాళీ స్థలాలను వదిలేయటం, వాటిపై పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఎవరు బడితే వారు చెత్త వేస్తుండటంతో, అవి చెత్త పాయింట్లుగా మారిపోతున్నాయని వివరించారు. ఖాళీ స్థలాల యజమానులను, వాటి పరిసరాల్లో నివసించే వారిని కూడా స్వచ్ఛ కార్యక్రమాల పట్ల చైతన్యవంతులను చేయాలని సూచించారు. దీంతో పాటు నగరంలోని ప్రతి ఇంటి నుంచి తప్పకుండా చెత్తను సేకరించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఇప్పటికే కమ్యూనిటీ రిసోర్సు వాలంటీర్లను నియమించి, స్వచ్ఛ ఆటోల హాజరు, ఇంటింటి నుంచి చెత్త సేకరణ అంశంపై నగరవాసుల అభిప్రాయాలు సేకరించటం జరుగుతుందని, వీరితో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఘన వ్యర్థాల నిర్వహణపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సర్కిల్‌లో గ్యార్బేజీ వర్నలబుల్ పాయింట్స్, నిర్మాణ వ్యర్థాలు వేసే కేంద్రాలు, ఓపెన్ ప్లాట్లు తదితర గ్యార్బేజీ పాయింట్లను గుర్తించి, వాటిని పూర్తిగా ఎత్తివేయటానికి కార్యచరణ రూపొందించిన అమలు చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ఆటంకం ఎర్పడిందని, ఇక నుంచి ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల లోపు డిప్యూటీ కమిషనర్లు తప్పనిసరిగా పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలని, జోనల్ కమిషనర్లు కూడా తరుచుగా క్షేత్ర స్థాయి తనిఖీ నిర్వహించాలని స్పష్టం చేవారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను డిప్యూటీ కమిషనర్లు వారంలో కనీసం రెండుసార్లు తనిఖీ చేయాలని, మెడికల్ ఆఫీసుర్లు మూడుసార్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. తరుచుగా రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసే వారిని, నిర్మాణ వ్యర్థాలను వేసే వారిని గుర్తించి, జరిమానాలను విధించాలని తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద్య కార్మికులను, స్వచ్ఛ ఆటోడ్రైవర్లు, హెల్పర్లు, ఎస్‌ఎఫ్‌ఏలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సీఆర్‌పీలు వంద శాతం హాజరు ఉండటంతో పాటు యూనిఫారాన్ని ధరించేలా పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.