హైదరాబాద్

‘విషతుల్యమైన కూల్ డ్రింక్స్ మానేద్దాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: మానవుని ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే కూల్ డ్రింక్స్ వాడకాన్ని పూర్తిగా మానివేయాలని జన విజ్ఞాన వేదిక ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వేదిక ఆధ్వర్యంలో ప్రజల్లో చైతనం కల్పించేందుకు రూపొందించిన కూల్ డ్రింక్స్‌ను మానేద్దాం.. సహజ పానియాలే తాగుదాం.. పోస్టర్‌ను వేదిక అధ్యక్షుడు అందె సత్యం, నిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు, క్రీడాకారులు శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ నారాయణ ఆవిష్కరించారు. నేటి ఆధునిక జీవనశైలిలో ప్రకృతిసిద్ధ సహజ పానియాల వినియోగం కన్నా కూల్‌డ్రింక్స్ తాగడం ముఖ్య భాగంగా మారిపోయిందని అన్నారు. వేసవి కాలంలో వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. హానికారక రసాయనాలతో తయారు చేస్తున్న పానియాలు మానవుని ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని తెలిపారు. లీటర్ కూల్‌డ్రింక్‌లో 0.0180 మిల్లి గ్రాముల క్రిమి సంహారక మందులు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఏన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) బయట పెట్టిందని చెప్పారు. శీతల పానియాల్లో 36 రెట్లు ఎక్కువగా హానికారకాలను వాడుతున్నట్టు నిర్ధారించారు. ప్రపంచ మొత్తంలో ఒక సంవత్సరానికి రెండు కోట్ల టన్నుల రసాయనాలను కూల్‌డ్రింక్స్ రూపంలో ప్రజలు సేవిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిలో అనారోగ్యానికి కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్, పాస్పరిక్ ఆమ్లం, అస్పర్టేమ్, సోడియం, బెంజోమెట్ వంటి రసాయనాలను వాడుతున్నారని వివరించారు. వీటిలోని అదనపు క్యాలరీలు స్థూల కాయానికి దారితీస్తాయని, పిన్న వయస్సులోనే మధుమేహం వచ్చే అవకాశం పెంచుతున్నాయని చెప్పారు. చెక్కర కంటే 200 రెట్లు తియ్యగా ఉండే ఆస్పర్టేమ్ అనే కృత్రిమ తీపి పదార్థం క్యాన్సర్‌కు కారణం అవుతుందని చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రజలు వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు కూల్‌డ్రింక్స్‌ను వాడటం మాని సహజ సిద్ధమైన పండ్ల రసాలు సేవించాలని కోరారు. వేదిక ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వేదిక హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ సురేష్, ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ పాల్గొన్నారు.
సెలబ్రెటీలు ప్రకటనల నుంచి వైదొలగాలి
ప్రజల ఆరోగ్యాలను పాడుచేస్తున్న కూల్ డ్రింక్స్‌ను సేవించాలని సూచిస్తూ రూపొందించిన యాడ్స్ నుంచి సినిమా హీరోలు, సెలబ్రెటీలు వైదొలగాలని వేదిక విజ్ఞప్తి చేసింది. చల్లని పానియాలతో ప్రజలకు జరుగుతున్న నష్టాలను తెలుసుకున్న క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్, నటుడు చిరంజీవి ఈ యాడ్స్ నుంచి తప్పుకున్నారని తెలిపారు. ఇదే తరహాలో ప్రస్తుతం వాటిని ప్రమోట్ చేస్తున్న నటులు.. అభిమానుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహజ పానియాలైన మజ్జిగ, నిమ్మరసం, అంబలి, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగేలా వారిలో చైతన్యం కల్పించాలని కోరారు.