హైదరాబాద్

కనువిందు చేసిన నృత్య ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 20: శిల్పారామంలో నిర్వహించిన భరత నాట్యం ప్రదర్శన కనువిందు చేసింది. భరత నాటల్యం కళాకారిణి శ్రేయస్ జోషి ప్రదర్శించిన పుష్పాంజలి, అన్నమయ్య కీర్తన, రామవర్ణం, థిల్లాన అంశాలపై అద్భుతంగా నృత్యం చేశారు. వడపల్లి ప్రవీణ నేతృత్యంలో శిష్య బృందం భరత నాట్యం శైలిలో ప్రదర్శించిన వాతాపి గణపతిం, పరమశివ వర్ణం, కంజదలాయదాక్షి కామాక్షి, కావడి చిందు, గోపీగోపాల, జావళి, ఎంతటి కులుకే అంశాలను శ్రేయ కులకర్ణి, అనన్య, తుల్య, అమూల్య, నందిని, వసన, అనిక తమ నృత్యల విన్యాసాలతో మెప్పించారు.
‘విప్లవ శంఖం’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, ఏప్రిల్ 20: శ్రీకిరణ్ సాంస్కృతిక సమాఖ్య, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలలో విజేతలకు ఉత్తమ కవితా పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా.పాలకుర్తి మధుసూదన రావు పాల్గొని ఉత్తమ కవితా పురస్కారాలను ప్రదానం చేశారు. యువ కవులను ప్రొత్సహించేందుకు జాతీయ స్థాయిలో కవిత పోటీలను నిర్వహించండం అభినందనీయమని అన్నారు. రచయిత బాల గంగాధరయ్య రచించిన ‘విప్లవ శంఖం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.జే.చెన్నయ్య సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, పద్యకవి డా.పూసల రజనీ గంగాధర్, సంస్థ అధ్యక్షుడు లంకా వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ముట్టూరి కమలమ్మ సేవలు మరువలేనివి
కాచిగూడ, ఏప్రిల్ 20: ప్రముఖ సాహితీవేత్త మట్టూరి కమలమ్మ సాహిత్య రంగనికి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు అన్నారు. ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మట్టూరి కమలమ్మ సార్మక పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి లయన్ విజయ్ కుమార్, ప్రముఖ రచయిత్రి డా.ముక్తేవి భారతి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, సాహితీ కిరణం సలహాదారుడు పెద్దూరి వెంకటదాసు, రచయిత్రి దమయంతి పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. సాయి లలిత మ్యూజిక్ అకాడమీ నిర్వహణలో సినీ సంగీత విభావరి నిర్వహించారు.
హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్
ఖైరతాబాద్, ఏప్రిల్ 20: చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ముగ్దాలో గ్రేట్ ఇండియా హ్యాండ్‌లూమ్ పేరుతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కొనసాగే ప్రదర్శనను వర్ధమానతారలు సిద్ది ఇద్నాని, మన్నత్ సింగ్ ప్రారంభించారు. ప్రపంచంలోనే భారతీయ చీరకట్టుకు ప్రాధన్యత ఉందని అన్నారు. ఇక్కడి సాంప్రదాయ చీరకట్టుకును అభివృద్ధి చెందిన మహిళలు సైతం ఎంతగానో ఇష్టపడతారని అన్నారు. మోడ్రన్ దుస్తుల్లో కంటే చీరల్లోనే అద్భుతంగా కనిపిస్తారని చెప్పారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి రూపొందించిన డిజైనరీ చీరలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనంతరం సాంప్రదాయ చీరలతో మోడల్స్ నిర్వహించిన క్యాట్‌వాక్ ఎంతగానో ఆకట్టుకుంది.