హైదరాబాద్

నిర్ణయం మీది.. ప్లాన్ మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన అనుమతి కావాలంటే ఆర్కిటెక్చర్ మొదలుకుని, అన్ని సరిగ్గా ఉన్నా, అధికారులు, వారి కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని దళారుల వరకు చేతులు తడపాల్సిందే! ఈ క్రమంలో చిన్న బడ్జెట్‌తో, లేక చిన్న ప్లాటులో బ్యాంక్ రుణాలతో ఇళ్లు కట్టుకునే యజమానులకు బల్దియా చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. భవన నిర్మాణ అనుమతుల జారీ, లేఔట్ల ఆమోదం, అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ల జారీ వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి అవినీతికి తావులేకుండా, మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు మంజూరు చేసేందుకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పూణే పాలక సంస్థ తరహాలో డీపీఎంఎస్ విధానాన్ని అమలు చేస్తుంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ మొత్తం ప్రక్రియలో కూడా అక్రమార్కులైన కొందరు అధికారులు ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆఫ్‌లైన్‌లో బేరసారాలు కుదుర్చుకుని మధ్య తరగతికి చెందిన చిన్నసైజు ప్లాటు యజమానులను నిలువు దోపిడి చేస్తున్నట్ల గుర్తించిన బల్దియా అధికారులు, ఇకపై ఆర్కిటెక్చర్‌ను, ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన ప్లాన్లను కూడా అందించేందుకు సిద్దమైంది. డీపీఎంఎస్ ఆన్‌లైన్ అనుమతుల విధానంలో భారీ మార్పులు చేసిన బల్దియా ఈ కార్యక్రమాన్ని 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అధికారులు, మధ్యవర్తులతో ఎలాంటి సంబంధం లేకుండా ఇల్లు కుట్టుకోవాలనుకుని నిర్ణయించుకున్న ఇంటి యజమాని నేరుగా బల్దియా ఆఫీసుకు వస్తే అక్కడ అతనికున్న స్థల విస్తీర్ణాన్ని బట్టి ప్లాన్‌ను జీహెచ్‌ఎంసీ సమకూర్చి, అందుకు అవసరమైన అనుమతులను పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఆర్కిటెక్చర్లు, ఇంటి యజమానులను ఒక వేదికపైకి తీసుకువచ్చి అధికారులకు కావల్సిన డాక్యుమెంట్లు, యజమానికి నచ్చిన ప్లాన్‌ను సమకూర్చి, అవసరమైన అనుమతినిచ్చేందుకు ఒక వేదికపైకి వీరిని తీసుకువచ్చేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో నిర్మించుకోవల్సిన ఇంటి ప్లాన్ మొదలుకుని పర్మిషెన్ కాపీ చేతికి వచ్చే వరకు అంతా ప్రక్రియ ఆన్‌లైన్‌లో సాఫీగా సాగిపోయేలా, ఎక్కడ అవినీతికి తావివ్వకుండా జరిగేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అనుమతులు జారీ చేస్తున్న సంబంధిత అధికారులు పర్మిషన్ తీసుకున్న వ్యక్తి అనుమతి ప్రకారమే నిర్మాణం చేపడుతున్నాడా లేదా అనే విషయాన్ని నిర్మాణం ముగిసే వరకు మూడు దశలుగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఫొటోలను ఆన్‌లైన్‌లో జత చేయాల్సి ఉంటుంది. పునాది స్థాయిలో ఓ సారి, స్లాబ్ గదుల నిర్మాణం, ప్రహరీగోడ నిర్మించటం, రంగులు వేసే స్థాయి తనిఖీలు నిర్వహించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారిపై చర్యలు కూడా తీసుకునేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.