హైదరాబాద్

చినుకు పడితే అన్నీ చిక్కులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో చినుకు పడితే చాలు సామాన్యులకు అన్నీ చిక్కులే. మెట్రోరైలుకు రోడ్డు విస్తరణ చేపట్టి వదిలేసిన ప్రాంతాలు, వివిధ ప్రాంతాల్లో వాటర్, డ్రైనేజీ పైప్‌లైన్ల కోసం తవ్వి వదిలేసిన గుంతలతో ద్విచక్ర వాహనదారులు వర్షం పడుతున్నపుడు ముందుకు కదలటం గగనంగా మారింది. ఒకవైపు ఎండలుమండిపోతున్నా, వాతావరణంలో చోటుచేసుకున్న వినూత్నమైన మార్పులు, క్యుములోనింబస్ మేఘాలు, ఉపరితల ఆవర్తనంతో నగరంలో తరుచూ జల్లులు కురుస్తుంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి దాదాపు గంట సేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. తొలుత ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులు కూడా వీయటంతో పలు చోట్ల చెట్ల నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల ఇళ్లపై, రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తాయి. వర్షాలు కురిసే పరిస్థితులను జీహెచ్‌ఎంసీ అధికారులు వాతావరణ శాఖ నుంచి ముందుగానే తెలుసుకుని, బల్దియాలోని వివిధ విభాగాలను అప్రమత్తం చేశారు. బల్దియాలో ఏడాది క్రితం ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్క్యు ఫోర్స్ జవాన్లు రంగంలో దిగి, రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించారు. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి, నిల్వ కావటంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ నీటిని తోడేసేందుకు బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కింద, సైదాబాద్ మెయిన్‌రోడ్డులో, లక్డీకాపూల్‌లో భారీగా రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తోడేస్తున్నారు. వర్షం కురుస్తున్నపుడు మాసాబ్‌ట్యాంక్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్లకు ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది. చార్మినార్ జోన్‌లోని ఫలక్‌నుమాలో విద్యుత్ స్తంభం విరిగి పడింది. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, స్తంభాన్ని తొలగిస్తున్నారు. 47 చోట్ల చెట్లు విరిగిపడినట్లు, మరో 18 ప్రాంతాల్లో వర్షపునీరు నిల్చిపోవటంతో పాటు మరో 69 ఇతర ఫిర్యాదులు అందినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించే పనులు వివిధ దశల్లో ఉన్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. మున్ముందు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.