హైదరాబాద్

హైదరాబాద్ కెప్టెన్‌గా యాష్‌మిశ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫౌండేషన్ (ఎస్‌ఎస్‌జీఏఫ్), గురు ద్రోణచార్య ఖేల్ ఖోజ్ ఫౌండేషన్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దాయాల్ ఉపద్యాయ్ జూనియర్ జాతీయ టీ-20 క్రికెట్ చాంపియన్‌షిప్ ఈనెల 23 నుంచి 28 వరకు గోవాలో నిర్వహిస్తారు. ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఎస్‌ఎస్‌జీఏఫ్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా యాష్‌మిశ్రా, వైసె కెప్టెన్‌గా వికెట్ కీపర్ బీ.అంబారీష్, జట్టు కోచ్‌గా అదీత్య బీదార్‌కార్, మేనేజర్‌గా డాక్టర్ ఫాహిముద్దీన్ ఖాజా వ్యవహరిస్తారు. హైదరాబాద్ జట్టుకు ఎంపికైన వారిలో పృథ్వీ సాయి స్వరూప్, అన్ష్‌నారాయణ్ గుప్తా, సీ.రాహుల్ రెడ్డి, రిషీకేష్ గౌడ్, గ్రహాం స్టేయిన్స్, ఎం.దినేష్, అనిరూద్ ధార్, వీ.రమేష్, వీ.అభిజయ్, డీ.శ్రీకాంత్, పాణిశర్మ, మిర్జా నోమాన్‌లున్నారు.
25 నుంచి బేస్‌బాల్ టోర్నీ
హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ బేస్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో టీ బాల్ (అండర్-14) బాలబాలికల బేస్‌బాల్ టోర్నమెంట్ ఈనెల 25 నుంచి సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్‌పల్లి ప్లేగ్రౌండ్‌లో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనదలిచిన అసక్తి గల వారు ఈనెల 24వ తేదీలోపు టోర్నమెంట్ నిర్వహకులను ఫోన్ నెంబర్ 9849642031, 9160770336, 9550917852లో సంప్రదించాలి.
ఘనంగా భారత్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్
మోడల్ హైస్కూల్ స్పోర్ట్స్ మీట్
హైదరాబాద్, ఏప్రిల్ 21: దోమలగూడలోని భారత్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి విచ్చేసి వివిధ క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని సాట్స్ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగింది. పలు అంశాలపై చర్చించారు. పాఠల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.