హైదరాబాద్

బహుగ్రంథ రచయిత్రి నిడమర్తి నిర్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: బహుగ్రంథ రచయిత్రి డా.నిడమర్తి నిర్మల అని పులువురు వక్తలు అన్నారు. ప్రముఖ రచయిత్రి డా.నిడమర్తి నిర్మల రచించిన ‘అవనిపై నితాంత ఆమని - దేవులపల్లి కృష్ణశాస్ర్తీ సాహిత్యావని’ పుస్తకావిష్కరణ సభ ఉదయ రవి చంద్రిక ఆర్ట్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త అప్పాజోష్యుల సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చెర్మన్ అయాచితం శ్రీ్ధర్, ప్రముఖ చారిత్రక నవల చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృష్ణశాస్ర్తీ సాహితీ అంతరంగ భావాలను ఎంతో అద్భుతంగా రచించారని కొనియాడారు. నిడమర్తి నిర్మల అనేక ప్రక్రియాల్లో రచనలు చేశారని పేర్కొన్నారు. ప్రముఖ పద్య గాయకుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణచే ‘్భక్తి చింతామణి’ నాటకంలోని ‘బిల్వమంగళ పాత్ర’ తుది ఘట్టం ఏకపాత్రాబినయ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ కవి సుధామ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, సాహితీవేత్తలు పేరి వెంకట రమణ, సంస్థ కార్యదర్శి పండ్ర ప్రగడ శ్రీనివాస రావు పాల్గొన్నారు.

వీడియో ఆధారిత
మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ప్రారంభం
ఖైరతాబాద్, ఏప్రిల్ 24: మ్యాట్రిమోనియల్ సర్వీసుల్లో జరుగుతున్న మోసాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు వీడియో ఆధారిత సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు దిల్ కే రిస్తే వ్యవస్థాపకులు సురేష్ నాయర్ తెలిపారు. బుధవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు అమర్‌నాద్, ఆశిష్, ఆనంద్‌తో కలిసి వైబ్ సర్వీసును ప్రారంభించారు. ఉమ్మడి కుటుంభ వ్యవస్థ కనుమరుగు కావడంతో అత్యధికంగా వివాహాలు మ్యాట్రిమోనీ సర్వీసుల ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. సాంకేతికతను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వధువరులకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకునేందుకు సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.