హైదరాబాద్

విగ్రహ ధ్వంసం ఘటనపై 29న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని కొద్దిరోజుల క్రితం పంజాగుట్ట సర్కిల్ నుంచి తొలగించటంతో పాటు దాన్ని చెత్త వాసనంలో డంపింగ్ యార్డుకు తరలించిన ఘటన మరో కీలకమైన మలుపు తిరిగింది. విగ్రహాన్ని తొలగించిన చోటే పునఃప్రతిష్ఠించాలని ఇప్పటికే తెలంగాణ మాల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బల్దియా అధికారులు వ్యవహారించిన తీరును నిరసిస్తూ వివిధ రకాలుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. స్పందించిన బల్దియా కమిషనర్ ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ఔట్‌సోర్సు కార్మికులను విధుల నుంచి తొలగించి, ఘటనపై ఐఎఎస్ అధికారిణి దాసరి హరిచందనతో విచారణకు ఆదేశించారు. 29న శేరిలింగంపల్లిలోని మున్సిపల్ ఆఫీసులో నిర్వహించనున్న విచారణకు హాజరుకావాలని కోరుతూ 15 దళిత సంఘాలకు చెందిన నేతలకు నోటీసులు జారీ చేశారు.
విచారణపై నమ్మకం లేదు
* మాల సంక్షేమ సంఘం
బల్దియాకు చెందిన ఓ జోనల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుభాష్ ప్రమేయంతోనే అంబేద్కర్ విగ్రహం ధ్వంసమై, చెత్త వాహనంలో డంపింగ్ యార్డుకు తరలించారని తెలంగాణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుర రాంప్రసాద్ ఆరోపించారు. ఒకే హోదా కలిగిన ఓ అధికారిపై ఆరోపణలు ఉండగా, అదే హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారి నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపడుతారనే నమ్మకం తమకు లేదని, ఘటనపై నిజానిజాలను వెలుగులోకి తెచ్చి, బాధ్యులను శిక్షించేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని ఇప్పటికే తాము కమిషనర్ దాన కిషోర్‌ను కోరినట్లు రాంప్రసాద్ తెలిపారు. పంజాగుట్ట సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం, బల్దియా ఆఫీసులో మరో రెండు విగ్రహాలను అనుమతి లేకుండా ఏళ్ల క్రితం ప్రతిష్ఠించగా, వాటినెందుకు తొలగించటం లేదని ప్రశ్నించారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే వరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
నిరాహారదీక్షకు
తెలుగు తమ్ముళ్ల మద్దతు
భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, అవమానించిన చోటే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకెల దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం ఘటనకు నిరసనగా లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ భవన్‌లో నిరాహారదీక్ష చేపట్టిన తెలంగాణ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్సు అధ్యక్షుడు సుదర్శన్ బాబును కలిసి మద్దతు పలికారు. టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణపుజారి, నేత లంకెల దీపక్ రెడ్డి మాట్లాడుతూ దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించిన సీఎం కేసీఆర్ ఇపుడు తానే ముఖ్యమంత్రి అయ్యి దళితులను, దళిత నేతలను అవమానిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క సందర్భంలోనూ భారత రాజ్యాంగ కర్త అంబేద్కర్, దేశానికి ఉప ప్రధానిగా సేవలందించిన బాబూ జగ్జీవన్‌రామ్‌కు పూలమాల వేసి నివాళి అర్పించలేదని మండిపడ్డారు. 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రగల్బాలు పలికి, ఐదుగురితో కమిటీ వేసి విదేశాల్లో ఉన్న విగ్రహాలను అధ్యయనం చేశామని చెబుతూ, ఇంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కానీ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలను మాత్రం ధ్వంసం చేస్తూ, భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. పంజాగుట్ట సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నెల్లల్ల కిషోర్, రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి బాలాజీ, తెలుగు యువత నాయకులు ఓంప్రకాశ్, నల్లగుట్ట రాజు, అన్వర్, మాసారం ప్రవీణ్ కుమార్, రాంబాబు ఉన్నారు.