హైదరాబాద్

రూ.3వేల కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో వౌలిక వసతుల మెరుగు, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేపడుతున్న ఎస్‌ఆర్‌డీపీ ఇతర ప్రతిష్టాత్మక పనులు చేపట్టేందుకు రూ.3వేల కోట్ల వరకు రూపి టర్మ్‌లోన్ కింద రుణం సేకరించినట్లు బల్దియా కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నందున, కోడ్ ముగిసిన వెంటనే ఈ నిధులు జీహెచ్‌ఎంసీకి వస్తాయని ఆయన వెల్లడించారు. నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతున్న మహానగరవాసులకు ఊరట కల్గించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టు మొదటి దశ కింద చేపట్టిన పనులన్నీ డిసెంబర్ చివరికల్లా పూర్తి చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన ప్రధాన కార్యాలయంలో ఎస్‌ఆర్‌డీపీ పనులు, నాలా విస్తరణ పనులు, భూసేకరణ తదితర అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. మొదటి దశ కింద చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లకు ఈ సంవత్సరం చివరికల్లా మరో రూ. 600 కోట్ల వరకు బిల్లులు చెల్లించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన వివిధ దశల్లో కొనసాగుతున్న ఎస్‌ఆర్‌డీపీ పనులన్నీ కూడా డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పనుల పూర్తికి కాల నిర్ణయ పట్టికలను తయారు చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులకు ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ అంశంలో భూమి కోల్పోయిన యజమానులకు ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టీడీఆర్)లు అందించే విషయంలో విస్తత్రంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌బీనగర్ అండర్‌పాస్‌కు సంబంధించి బైరామల్‌గూడ, ఎల్‌బీనగర్, ఉప్పల్ మార్గంలో భూ సేకరణపై వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అంబర్‌పేటలో 1.60 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 281 ఆస్తుల నుంచి సేకరించాల్సి ఉండగా, 171 మంది యజమానులు తమ ఆస్తులను అప్పగించేందుకు అంగీకారాన్ని తెలిపారని తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 140 ఆస్తులకు సంబంధించి 175 చెక్కులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపారు. 129 నిర్మాణాలను తొలగించినట్లు వెల్లడించారు. పూడికతీత పనులను ప్రస్తావించిన ఆయన వర్షాకాలానికి ముందే ఈ పనులు పూర్తికావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీ్ధర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి,ఎస్‌ఈలు పాల్గొన్నారు.