హైదరాబాద్

ప్రక్షాళన మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన టౌన్‌ప్లానింగ్ విభాగం నిత్యం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! గ్రేటర్‌లోని టౌన్‌ప్లానింగ్‌లో అవినీతిని రూపుమాపి, మధ్యవర్తులు, దళారుల్లేకుండా పారదర్శకతతో మెరుగైన సేవలందించే దిశగా చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రక్షాళన మొదలైంది. ఇందులో భాగంగానే 24 సర్కిళ్లలో విధులు నిర్వర్తిస్తున్న 30 మంది సెక్షన్ ఆఫీసర్లకు స్థానం చలనం కల్గిస్తూ కమిషనర్ డా.బి. జనార దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకెన్నడూ కూడా ఇంత భారీ సంఖ్యలో సెక్షన్ ఆఫీసర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు వెలువడలేదు. ప్రతి సర్కిల్ పరిధిలో తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిత్యం సంచరిస్తూ అనుమతి ఉన్నా, అనుమతి లేకుండా కొనసాగుతున్న నిర్మాణాల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో అమ్యామ్యాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తటంతో మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు జనార్దన్ రెడ్డి ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. అంతేగాక, ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణం జరుగుతుంటే దాన్ని ఆపాల్సిన బాధ్యతాయుతమైన పదవీలో ఉన్న సెక్షన్ ఆఫీసర్లు యజమానులతో బేరసారాలు కుదుర్చుకుని అక్రమ నిర్మాణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ అండగా నిలుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్‌తో రూపొందించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సిన నాగార్జున జంక్షన్‌లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, కనీసం నోటీసులు జారీ చేయకపోవటం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవటం పట్ల కొద్ది నెలల క్రితం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత సర్కిల్ 10 సెక్షన్ ఆఫీసర్‌పై ఏకంగా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే! అంతేగాక, అక్రమ నిర్మాణాలపై కొంతకాలం హైకోర్టు జిహెచ్‌ఎంసిపై మండిపడుతుండటం, ఎప్పటికపుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంను ప్రవేశపెట్టడటం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయటం వల్ల మున్ముందు అక్రమ నిర్మాణాలు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలన్న ఆలోచనలో భాగంగానే ఈ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆయన ప్రస్తుతం సర్కిళ్ల వారీగా ఉన్న ఏసిపిల వివరాలను తెప్పించుకుని కసరత్తు చేస్తున్నారు.