హైదరాబాద్

డ్రగ్స్ కేసులో ‘సిట్’ నివేదికను బహిర్గతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరవాసులు, ముఖ్యంగా ఉజ్వలమైన భవిష్యత్తు కల్గిన విద్యార్థులు, సినీ తారల జీవితాలతో చెలగాటమాడుతున్న డ్రగ్స్ కేసులో ప్రభుత్వం నిజాలను సమాధి చేసేందుకు కుట్ర చేస్తోందని నగర తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు హైదరాబాద్ నగరం డ్రగ్స్‌బాద్‌గా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నగర పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు పీ.సాయిబాబా, నెల్లల్ల కిషోర్, ముప్పిడి మధుకర్, నాగు నగేశ్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం బయటపడ్డ డ్రగ్స్ కేసులో అప్పటి ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న అకున్ సబర్వాల్ వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుంటే, అతని బృందాన్ని తప్పించి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటం సర్కారు నిజాలను సమాధి చేసేందుకు చేస్తున్న కుట్ర అని వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రమించి విచారణ చేపట్టగా, ప్రభుత్వం బాధితులు, నిందితులు అంటూ రెండుగా విభజించి, అప్పటి వరకున్న 12 కేసులను రెండు కేసులుగా కుదించిందని ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా డ్రగ్స్ వాడిన వారిని తప్పించి, డ్రగ్స్ సరఫరా చేసున వారిపై మాత్రమే కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం జరిగినా, భావితరాలను రక్షించుకోవల్సిన ప్రభుత్వం బాధ్యతను మరిచి వ్యవహారిస్తుందని, ఒకవేళ ప్రభుత్వానికి ఏ మాత్రం పారదర్శకత ఉన్నా, సిట్ విచారణ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు బాలరాజ్ గౌడ్, రామకృష్ణ, రవీందర్ చారి, ఎం.రాజు, ఎస్.ప్రకాశ్ పాల్గొన్నారు.

2న గ్రీన్ మారథాన్-2019
ఖైరతాబాద్, మే 15: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐఐ, హైదరాబాద్ రన్నర్, పల్లవి స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చేనెల 2న గ్రీన్ మారథాన్-2019ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన టీ-షర్ట్, మెడల్స్‌ను సీఐఐ డైరెక్టర్ సుభాజిత్ షా, కొమరయ్య, యోగా శిక్షకురాలు తేజస్విని మనోజ్ఞ ఆవిష్కరించారు. ఈ ఏడాది వాయు కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా అవగాహన రన్‌లు కొనసాగుతున్నాయని చెప్పారు. నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యంతో అనేక రకాల శ్వాస సంబంధ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని పేర్కొన్నారు. గాలిలో కలుస్తున్న విషపూరితమైన వాయువులతో అనేక జీవరాసులు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు పల్లవి పాఠశాల నుంచి 10కే, 5కే, 3కే రన్ కొనసాగుతుందని తెలిపారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఉపాసన ముఖ్యఅతిథులుగా హాజరై మారథాన్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. సుమారు రెండువేల మంది పాల్గొంటారని తెలిపారు. నిర్ణీత సమయంలోపు పూర్తిచేసిన వారికి సర్ట్ఫికెట్స్, మెడల్స్‌ను అందిస్తామని వివరించారు.