హైదరాబాద్

పోలీస్ పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలను పర్యవేక్షించిన పోలీసుల పనితీరు అభినందనీయమని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు జరిగినా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధి నిర్వహణలో తమ కర్తవ్యాన్ని నిర్వహించిన పోలీస్ సిబ్బందిని ఆయన కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని స్థానిక సంస్థల వరకు బందోబస్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు భాగా పని చేశారన్నారు. బందోబస్తులో పోలీస్ శాఖలో అన్ని విభాగాల అధికారులు పరస్పర సహకారంతో ఎన్నికలను నిర్వహించారని, అలాగే ఎన్నికల బందోబస్తులో పోలీసులకు సహకరించిన ప్రజలను ఆయన అభినందించారు.