హైదరాబాద్

మోగిన ‘స్థారుూ’ ఎన్నికల నగరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని కోటి మంది జనాభాకు అతి ముఖ్యమైన పౌరసేవలను, అభివృద్ధిని అందించే జీహెచ్‌ఎంసీ కొద్ది నెలలుగా వరుసగా ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. కొద్ది నెలల క్రితం అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్లలో మునిగి తేలిన బల్దియా నేటికీ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తుండగానే, స్థారుూ సంఘం ఎన్నికల నగరా మోగింది. కీలక నిర్ణయాలు తీసుకుని స్థారుూ సంఘం ఎన్నికకు మళ్లీ నగరా మోగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థారుూ సంఘం పదవీకాలం ముగియటంతో ప్రస్తుత పాలక మండలి చివరి దఫా స్థారుూ సంఘంలోని 15 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. నగరంలోని 150 మంది కార్పొరేటర్లు ఈ 15 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. పాలక మండలిలో అత్యధిక సంఖ్యలో సభ్యులున్న టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలకు చెందిన సభ్యులే ఎన్నికకానున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు అదనపు కమిషనర్(ఎన్నికలు)కు నామినేషన్లను సమర్పించుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 3న నామినేషన్లను వివరాలను విడుదల చేసి, 4వ తేదీన ఉదయం పదకొండు నుంచి పనె్నండు గంటల మధ్య స్క్రూటినీ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 7వ తేదీ మధ్యాహ్నాం మూడు గంటల వరకు గడువు విధించారు. ఆ తర్వాత పోటీలు నిలిచిన అభ్యర్థుల వివరాలను కూడా 7వ తేదీన ప్రకటించనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 13న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు బల్దియా ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ నిర్వహించి, మూడు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
కొత్త వారికి అవకాశం దక్కేనా?
మొత్తం 15 మంది సభ్యులను ఎన్నుకోనున్న ఈ స్థారుూ సంఘం ఎన్నికల్లో ఈ సారి కూడా పలువురు కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు ఉన్న టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదివరకు ఎన్నుకున్న రెండు స్థారుూ సంఘాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరికీ కొత్తవారికే అవకాశం ఇవ్వటం పట్ల, ఇప్పటి వరకు స్థారుూసంఘం సభ్వత్వం దక్కని కొత్త కార్పొరేటర్లు తమకు ఈ సారి అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. వీరిలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందో వేచి చూడాలి.