హైదరాబాద్

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే పోటీ చేసిన అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు విధిగా పోలీస్ వెరిఫికేషన్ పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. సోమవారం ఆయన నగరంలోని నాంపల్లి, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న ఎల్‌బీ స్టేడియం, నిజాంకాలేజీల్లో ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి ఓట్ల లెక్కింపులో ఐదు వీవీ ప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా లెక్కించనున్నట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం దాకా కొనసాగే అవకాశముందనివివరించారు. ఈ లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు తగు మంచినీరు, ఇతర ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుకేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఓట్ల లెక్కింపునకుగాను ప్రతి సెగ్మెంట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడ్ని నియమించినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అధికారులకు ఇప్పటికే ఈ నెల 16వ తేదీన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని, తిరిగి 22వ తేదీన రెండో దశగా ముఫకంజా కాలేజీలో శిక్షణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఉదయం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరవనున్నట్లు తెలిపారు. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.