హైదరాబాద్

ఆధిక్యంలో ఏడుగురు క్రీడాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాయదుర్గంలోని ఒయాసీస్ స్కూల్‌లో జరుగుతున్న 4వ ఫీడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో రెండో రోజు ఆట ఐదు రౌండ్లు ముగిసేసరికి ఏడుగురు ఆటగాళ్ళు చెరి ఐదు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఐదు పాయింట్లు సాధించిన వారిలో పి.గోపీనాథ్ (తమిళనాడు), మీర్ మహీర్ అలీ (తెలంగాణ), సిద్దీ అక్బర్ (తమిళనాడు), ఎన్.వర్షిత్ (ఏపీ), కృష్ణమూర్తి (తమిళనాడు), పివి.సత్యనారాయణ (తెలంగాణ), జీఎస్.దినేష్ బాబు (ఏపీ) ఉన్నారు.

ఆలిండియా పెప్సీ కప్ క్రికెట్ టోర్నీకి
ఎస్‌ఆర్‌ఎంసీఎఫ్ క్రికెట్ అకాడమీ జట్టు
హైదరాబాద్, మే 21: ఇంతియాజ్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో కర్నాటకలోని బెంగుళూరులో ఈనెల 23 నుంచి 26 వరకు ‘ఆలిండియా పెప్సీ కప్’ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో పాల్గొంటున్న ఎస్‌ఆర్‌ఎంసీఎఫ్ సీఏ జట్టుకు వైవీ.అఖిల్ గౌడ్ నాయకత్వం వహిస్తారు. ఈ జట్టుకు కోచ్‌గా డి.సురేష్, మేనేజర్‌గా గౌతం వ్యవహరిస్తారు. జట్టుకు ఎంపికైన వారిలో అఖిల్‌గౌడ్ (కెప్టెన్), దీక్షిత్ (వైస్ కెప్టెన్), పవన్ గౌడ్ (వికెట్ కీపర్), శ్రీనివాస్, తరుణ్ కుమార్, చత్రపతి కుమార్, శివ కుమార్, సాయి కోటి, యశ్వంత్, నవదీప్, ప్రణవ్, హర్షన్, సిద్ధార్థ్ యావ్, షణ్ముఖ్, చేతన్, శ్యాంసుందర్ ఉన్నారు. బెంగుళూరులో జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్టు సభ్యులను ఎస్‌ఆర్‌ఎంసీఎఫ్ సభ్యులతో పాటు క్రిసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫాహిముద్దీన్ ఖాజా, సీబీఐ ఇన్‌స్పెక్టర్ వై.విజయ్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జట్టు సభ్యులు కలిసి కట్టుగా ఆడి బెంగళూరులో జరుగనున్న చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించి ట్రోఫిని సాధించాలని పేర్కొన్నారు.