హైదరాబాద్

ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండురోజుల నుంచి వేసవి ఎండలు మండిపోతున్నాయి. 23వ తేదీ వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నందున, ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మంగళవారం ఉన్నట్టుండి నగరంలో వాతావరణం చల్లబడింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ దంచికొట్టగా- సాయంత్రం మేఘాలు కమ్ముకుని ఉక్కపోత అధికమైంది. చల్లటి గాలుల కోసం ఎదురుచూస్తున్న మహానగరవాసులను వరుణుడు కరుణించాడు. రాత్రి ఏడు- ఏడున్నర గంటల మధ్య నగరంలోని పలు ప్రాంతాల్లో చల్లటి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత భారీగా కురిసింది. తొలుత జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శ్రీనగర్‌కాలనీ, పంజాగుట్ట, అమీర్‌పేట, సనత్‌నగర్, తార్నాక, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత సికిందరాబాద్, బషీర్‌బాగ్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో భారీగా కురిసింది. పలుచోట్ల వేగంగా గాలులు వీయటంతో ముందుజాగ్రత్త చర్యగా కరెంటు సరఫరాను నిలిపివేశారు. పలు రద్దీ కూడళ్లలో సిగ్నల్స్ పనిచేయకపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల రోడ్డుకు ఒకవైపు వివిధ పనుల కోసం పలు ప్రభుత్వ, ప్రైవేటు శాఖలు తవ్వి వదిలేయటంతో రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో సుమారు గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వేసవి ఎండల వేడిమితో అల్లాడిపోయిన నగరవాసులు కొందరు చల్లటి గాలుల్లో, వర్షంలో తడవటం కన్పించింది. రాత్రి కూడా మేఘాలు కమ్ముకుని ఉండటంతో వర్షం దంచికొట్టే అవకాశముండటంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు అప్రమత్తమయ్యాయి.