హైదరాబాద్

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లును పూర్తి చేసినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాలమాకులలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 19 రౌండ్లు, అత్యధికంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 43 రౌండ్లు లెక్కింపు ఉంటుందని వివరించారు. మండువేసవిలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి పార్కింగ్ సమస్య తలెత్తకుండా సమీపంలోని చెరువు వద్ద అన్ని రకాల వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అక్కడి నుంచి కౌటింగ్ కేంద్రం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పారు. పార్టీల ఏజెంట్లకు ఇప్పటికే పాసులను జారీ చేశామని, పాసుల పొందిన వారు సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం లెక్కింపు అనంతరం లక్కిడ్రాద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్‌లోని ఓట్లను సిబ్బంది లెక్కిస్తుందని అన్నారు. అనుకోని సందర్భాలలో ఈవీఎంలు మొరాయిస్తే వీవీ ప్యాట్‌లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తామని వివరించారు. ఈవీఎంల లెక్కింపు 14 టేబుల్స్‌ను, పోస్టల్ బ్యాలెట్ల కోసం 4టేబుల్స్‌ను సిద్దం చేశామని చెప్పారు. వీవీ ప్యాట్‌లతో పాటు పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించాల్సి ఉన్నందున ఫలితాలు మరో రెండు గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సువిధ యాప్‌లో వెనువెంటనే ఫలితాలను సిబ్బంది అప్‌లోడ్ చేస్తుందని పేర్కొన్నారు. వెయ్యి మంది సాయుధ పోలీసుల నిఘాలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.