హైదరాబాద్

నేటి నుంచి ‘స్థారుూ’ నామినేషన్ల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మహానగర పాలక సంస్థ నగరానికి సంబంధించిన అభివృద్ధి, కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం ఎన్నికకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నిన్నమొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల్లో బిజీగా ఉన్న బల్దియా ఇపుడు స్థారుూ సంఘం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థారుూ సంఘం పదవీకాలం ముగియటంతో ప్రస్తుత పాలకమండలి చివరి దఫా స్థారుూ సంఘంలోని 15 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. నగరంలోని 150 మంది కార్పొరేటర్లుండగా, ప్రతి పది మందికి ఒకరు చొప్పున మొత్తం 15 మందిని ఎన్నుకోనున్నారు. అయితే మిత్రపక్షాలైన టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లే ఎక్కువమంది ఉండటంతో ఓ పార్టీ ఏడు, మరో పార్టీ ఎనిమిది మందిని నియమించుకునేందుకు అభ్యర్థుల ఎంపిక కోసం ఉభయపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నేటి నుంచి నామినేషన్లను 1వ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమర్పించుకోవచ్చునని అధికారులు తెలిపారు. వచ్చే నెల 3న నామినేషన్ల వివరాలను విడుదల చేసి, 4వ తేదీన ఉదయం పదకొండు నుంచి పనె్నండు గంటల మధ్య స్క్రూటినీ, ఉపసంహరణకు వచ్చే నెల 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను 7న విడుదల చేయనున్నారు.
రెండు పోలింగ్ బూత్‌లు
ఒక వేళ అవసరమైన నేపథ్యంలో పోలింగ్‌ను 13న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్యాలయంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఫేస్ టు ఫేస్ హాల్, లైబ్రరీలో 1నుంచి 75 వార్డుల వరకు, 76 నుంచి 150 వరకు వార్డుల సంఖ్య ప్రకారం ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపును చేపట్టి, ఫలితాలను తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ 15 మంది ఎవరు?
కార్పొరేటర్లు ఎన్నుకోనున్న 15 మంది స్థారుూ సంఘం సభ్యులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలకు చెందిన ఇప్పటివరకు అవకాశం లభించని వారికి కేటాయించాలని రెండు పార్టీలకు చెందిన నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి తమకు అవకాశం కల్పించాలంటూ కొందరు ఇప్పటికే టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసింది.