హైదరాబాద్

మంచినీటి ఇక్కట్లకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : నగరంలో మంచినీటి సమస్య లేకుండా ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ ఎం. దాన కిషోర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వేసవిలో మంచినీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ గత సంత్సరం కంటే ఈ ఏడాది నీటి సమస్యలు తలెత్తకుండా అధిక సంఖ్యలో ట్యాంకర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డిమాండ్ ఉన్న 20 చోట్ల వెంటనే నూతన ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాదితో పోల్చితే దాదాపుగా 60 శాతం ట్యాంకర్ల ద్వారా నీటి వినియోగం పెరిగిందని తెలిపారు. మంచినీటి సరఫరాలో కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ తెలిపారు. జీఎం, మేనేజర్, లైన్‌మెన్ నిరంతరం పర్యటిస్తూ మంచినీటి సరఫరా సమయంలో నీటిని వృథాగా పోకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. నగర వాసులకు మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిర చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు.
సమావేశం జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పీ. రవి, రెవెన్యూ డైరెక్టర్ బీ.విజయ్‌కుమార్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.