హైదరాబాద్

ఎగ్జిబిషన్లతో చేనేతకారులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : నగరంలో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేత కళాకారులకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని వర్ధమాన తార ప్రీతి అస్త్రాని పేర్కొంది. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ది హాత్ - ప్రీమియమ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. చేతివృత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్ల ద్వారా లభిస్తుందని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయాలు జరుపుకోవడంతో వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు నగర వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని వారి నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటారని చెప్పారు. ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు కొలువుదీరిన ప్రదర్శనను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
రెండు రోజులపాటు కొనసాగే ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు రూపొందించిన ప్రదర్శనలో వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్వాహకులు అనుపమ్ ముఖర్జీ తెలిపారు.