హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ను ముంచిన మూడు నియోజకవర్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని పార్లమెంట్ ఎన్నికల్లో గండికొట్టడంతో రెండు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 80 వేల అత్యధిక మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మంత్రి చామకూర మల్లారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలోకి దించి తిరిగి తాను ప్రాతినిద్యం వహించిన పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చేసిన భావన బెడిసి కొట్టింది. తన సొంత అల్లున్ని బరిలోకి దింపి అధికారంలో ఉన్న తాను ప్రాతినిద్యం వహించే మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెంచుకోవాల్సిన మెజారిటీని పెంచుకోకుండా విఫలం కావడంతో 70 వేల ఓట్లను కోల్పోయి తన అల్లుడి ఓటమికి ప్రధాన కారకులయ్యారు. మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 వేల ఓట్ల మెజారిటీని సాధించుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పార్టీ మెజారిటీని 29వేలకు పెంచుకున్నారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో జరిగిన మార్పు కారణంగా టీఆర్‌ఎస్ తన ఓట్ల మెజారిటీని భారీగా కోల్పోయి నష్టాన్ని చవిచూశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీం పట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై కేవలం 200పైచిలుకు ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజయం సాధించి తిరిగి తన సీటును పదిల పరుచుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి కాంగ్రెస్‌కి 5,624 మెజారిటీని సాధించడంతో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేవలం 5219 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా ఈ జిల్లాలో కేవలం మల్కాజ్‌గిరి పరిధిలోని ఎల్‌బీనగర్, భువనగిరి పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతంతోనే ఈ రెండు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడం విశేషం.