హైదరాబాద్

ముంబాయి, కేరళ జట్ల గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో ఆలీండియా ఇంటర్ డిస్ట్రిక్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభమైంది. నగరంలోని ఎంఎల్‌ఆర్ కాలేజీ క్యాంపస్ మైదానంలో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌ను ఆలిండియా హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ రామసుబ్రమణి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి ఎ.నమాదేశ్వర్ పాండే, కోశాధికారి ప్రీత్‌పాల్ సింగ్, తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, రంగారావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మ్యాచ్‌ల్లో పంజాబ్ 11-7 స్కోరు తేడాతో ప్రత్యర్థి రాయ్‌గార్డ్‌పై, కేరళ 14-5తో ఖమ్మంపై, కరీంనగర్ 15-11తో బంద్రాపై, ముంబాయి 19-6తో గుంటూరుపై విజయం సాధించింది.
విజేతలుగా నిలిచిన కీర్తి, లోకేష్
* అండర్-17 బాల బాలికల చెస్ చాంపియన్‌షిప్
హైదరాబాద్, మే 25: ట్యాంక్‌బండ్ హైదరాబాద్ బోట్స్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అండర్-17 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో గంట కీర్తి, పి.వృతిక్ లోకేష్ విజేతలుగా నిలిచారు. చాంపియన్‌షిప్ ఆరు రౌండ్‌లపాటు కొనసాగింది. బాలుర విభాగంలో టాప్ బోర్డులో నిలిచిన హృతిక్ లోకేష్ ఆరు పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. కె.శరత్‌చంద్ర ఐదు పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలువగా, యజ్ఞప్రియా ఐదు పాయింట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. రుద్ర రక్షిత్, ఆర్‌ఎస్.శరన్, సూర్య అలకంటి చేరి ఐదు పాయింట్లతో మూడు, నాలుగు, ఐదుస్థానాల్లో నిలువగా, సిబి శ్రీనివాస్ మూడు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. అదే విధంగా బాలికల విభాగంలో గంట కీర్తి, భరత్ కోటి స్నేహ, యజ్ఞప్రియా పొలిసెట్టి, వి.నందిత, సాయిశ్రీచరిత వరేన్య, గుజ్జ దీక్షితులు వరుస స్థానాల్లో నిలిచి గెలుపొందారు. ఈ టోర్నమెంట్‌లో బాలబాలికల విభాగంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచినవారు జాతీయ పోటీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన ఆటగాళ్లకు ఆదివారం బోట్స్‌క్లబ్‌లో జరుగనున్న కార్యక్రమంలో బహుమతులను అందజేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక పోటీలు
హైదరాబాద్, మే 25: రంగారెడ్డి జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు మహేశ్వరం తుక్కుగూడలోని జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో జరుగుతాయి. అండర్-14 బాలబాలికల కోసం నిర్వహిస్తున్న ఈ ఎంపిక పోటీలో ప్రతిభ కనపరిచిన వారిని ఎంపికచేసి సరూర్‌నగర్‌లోని సాట్స్ స్టేడియంలో జరుగనున్న 30వ రాష్టస్థ్రాయి సబ్ జూనియర్ రాష్టస్థ్రాయి ఖోఖో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నారు. ఎంపిక పోటీలో పాల్గొనదలిచిన ఆసక్తిగల వారు ఎం.మహేందర్‌ను సెల్ ఫోన్ నెంబర్ 9030075551 లేదా కె.రామకృష్ణను 9000045297లో సంప్రదించాల్సి ఉంటుంది.
నకిలీ విత్తనాలు విక్రయంచే
వ్యాపారుల పై చర్యలు
వికారాబాద్ , మే 25: జిల్లాలలో నకిల విత్తనాలు విక్రహించే వ్యాపారుల పై వ్యవసాయ, పోలీస్ అధికారులు పరస్పర సహకారంతో అకస్మీక దాడులు నిర్వహించి చట్టరిత్య తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆయేష మస్తత్ ఖానం అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో సమావేషం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ జూన్ మాసం నుంచి ప్రారంభం అవుతున్నది. రైతులను మోసం చేసెందుకు డీలర్లు నకిలి విత్తనాలు అమ్మెందుకు రెడిగా ఉంటారు. అకస్మీకంగా తనిఖిలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల గ్రామ స్థాయిలో టాస్క్‌పోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మమ్మర తనిఖిలు చేయాలన్నారు. రైతులు నష్ట పోకుండ అధికారులు చూడలని అన్నారు. జిల్లా ఏస్పీ నారాయణ, అడిషనల్ ఏస్పీ బాస్కర్, అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.