హైదరాబాద్

పెద్ద చెరువు సుందరీకరణ ఎన్నడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 26: చెరువులో డ్రైనేజీ మురుగు నీరు కలువకుండా స్వచ్ఛమైన వర్షం నీరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని, సుందరీకరణ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన ప్రజాప్రతినిధుల హామీలు అమలుకు నోచుకోవడంలేదు. మురుగు నీరు, వ్యర్థ పదార్థాలతో నిండిన చెరువులో దుర్వాసన, దుర్గంధం వెదజల్లుతోందని ప్రేరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
సుందరీకరణ చేయకపోయినా పర్వాలేదు కానీ చెరువులో పేరుకుపోయిన కుళ్లిపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించాలని ప్రేరణ సంస్థ ప్రతినిధి గిరి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రేరణ సంస్థ, సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో చెరువును సందర్శించారు. అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుపై నిరసన తెలిపారు. చెత్త చెదారంతో పాటు కుళ్లిపోయిన వ్యర్థ పదార్థాలు, కోడి ఈకలు, చేపల వ్యర్థాలు, కూరగాయలు, కొబ్బరి బొండాలతో చెరువు కంపుకొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టిక్ ట్యాంకర్లు చెరువు సమీపంలో అక్రమ పార్కింగ్ చేస్తూ వచ్చిపోయే వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలుస్తున్నాయని ఆరోపించారు. వ్యర్థ పదార్థాలతో, కలుషితమైన డ్రైనేజీ మురుగు నీటి వల్ల పరిసర ప్రాంతాల కాలనీల ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పై సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని, లేనిచో ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో విఠల్ రెడ్డి, ఉపేందర్, రాజేందర్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.