హైదరాబాద్

తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. తెలంగాణ కల్చర్ అండ్ లివింగ్ ఆర్స్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘కళాయజ్ఞం’ పేరిట నృత్య ప్రదర్శనలు ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కళలను, కళాకారులను ప్రొత్సహిస్తుందని పేర్కొన్నారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, దైవజ్ఞశర్మ, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి విజయేంద్ర సాగర్, గోమాత నవీన్, సంస్థ అధ్యక్షురాలు మణిమంజరి సగర్ పాల్గొన్నారు.