హైదరాబాద్

కోటి దీపాలతో కోటికాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: అత్యంత భక్తిశ్రద్ధలతో ఆద్యంతం..ఆధ్యాత్మిక భావన, భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఏడోరోజుకు చేరుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభమైన కోటి దీపోత్సవం కార్యక్రమం శనివారం ఏడో రోజుకు చేరుకుంది.
కార్యక్రమంలో భక్తులు వెగిలిస్తున్న దీపాలు, నిర్వాహకులు ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌తో ఎన్టీఆర్ స్టేడియం ధగధగలాడుతోంది.
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దేవదవుడ్ని స్మరిస్తూ,ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వ్రతాలు, ప్రవచనామృతాలు వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కార్తీకమాసం ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను, మాసంలో చేయాల్సిన పూజాదికాల గురించి పీఠాధిపతులు, సద్గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు చేస్తున్న ప్రచవనాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ప్రతిరోజు ప్రత్యేకంగా ఓ పూజా కార్యక్రమాన్ని భక్తులే నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటంతో పాటు వివిధ పీఠాల అధిపతులు, గురువుల ప్రవచనాలు, సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖుల ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కార్తీకమాసం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజులనీ, ఈ రోజుల్లో శివుడ్ని పూజిస్తే అన్నిరకాల శుభం కల్గుతుందనే భావనలో ఉన్న భక్తులకు కార్తీకమాసం అనేది అన్ని రకాల దీక్షలకు, దేవుళ్లలో ఆది దేవుడైన వినాయకుడు, జగన్మాత, లోకమాత అయిన అమ్మవారిని, ఏడుకొండ వేంకటేశ్వస్వామితో పాటు ఏ భగవంతుడినైనా ఆరాధించేందుకు, పూజించుకునేందుకు అనువైన మాసమంటూ ఆధ్యాత్మిక వేత్తలు చేస్తున్న ప్రసంగాలు ప్రజల్లో అధ్యాత్మికభావనను పెంపొందిస్తున్నాయి. కోటి దీపోత్సవ కార్యక్రమంలలో శుక్రవారం కోటి పసుపు కొమ్ములతో నిర్వహించిన సుమంగళి పూజకు వేల సంఖ్యలో మహిళలు హజరు కాగా, శనివారం సర్వదోష నివారణ నిమిత్తం పూజలు నిర్వహించేందుకు రికార్డు స్థాయిలో భక్తులు హజరయ్యారు. సాయంత్రం ఆరు దాటిందంటే చాలు ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, దోమల్‌గూడ పరిసర ప్రాంతాలు ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పోటెత్తటంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ సగం వరకు వాహనాలు నిల్చిపోతున్నాయి. రామాయణ, మహాభారతం, భాగవతము వంటి పవిత్ర గ్రంథాలు కార్తీకమాసం గురించి ఎం చెబుతున్నాయన్న అంశంపై అధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు భక్తుల్లో భక్త్భివాన్ని పెంపొందిస్తున్నాయి.
ప్రతిరోజు సాయంత్రం అయిదున్నర గంటల నుంచి ప్రారంభమవుతున్న ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నిరాటంకంగా దాదాపు అయిదారు గంటల పాటు కొనసాగుతోంది. ఇందుకు హాజరయ్యే భక్తుల హృదయాల్లోని భక్తిప్రపత్తులు ఓ కారణమైతే, ఇక్కడ నిర్వహిస్తున్న పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.