హైదరాబాద్

ప్రజాస్వామ్య విలువల కోసం తపించిన కాళోజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 15: నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం తపించిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని పుస్తకావిష్కరణ సభలో వక్తలు కొనియాడారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇదీ నా గొడవ’ కాళోజీ ఆత్మకధ పుస్తకాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ పేరు తలుచుకుంటే ప్రజాస్వామ్య విలువలు గుర్తుకువస్తాయని అన్నారు.
అధికారం కోసం ఎన్నడూ తాపత్రాయపడని కాళోజీ ప్రజల బతుకులు మారేందుకు శ్రమించారని అన్నారు. శాసనమండలిలో ఆయన చేసిన ప్రసంగాలు తనకు ఎంతోప్రేరణ కలిగించాయని చుక్కారామయ్య అన్నారు. కాళోజీని మరిస్తే ప్రజాస్వామ్యానే్న మరిచినట్టేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాళోజీని ఇక్కడి ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమని, ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కాళోజీ భవన్‌ను ప్రజాభవన్‌గా తీర్చిదిద్దాలని వారు సూచించారు. ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్, ప్రభాకర్, రామశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.