హైదరాబాద్

ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఏప్రిల్ 22 : ఇంద్రారెడ్డి ఆశయసాదనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి సబితా రెడ్డి కోరారు.
శుక్రవారం ఇంద్రారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలోని ఆయన సమాధి సబితారెడ్డి, కుమారుడు కార్తీక్‌రెడ్డి, కోడలు, మనవరాలు, నాయకులతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రారెడ్డి కన్న కలలను నిజం చేసేందుకు నిరంతరం శ్రమిస్తామన్నారు. ఇంద్రారెడ్డి మరణించిన తర్వాత తమ వెంట ఉంటూ తమ కుటుంబాన్ని ఆదరించి, అండగా ఉన్న ప్రజలను ఎప్పుడూ మరువలేమన్నారు. చేవెళ్ల ప్రజలు కూడా తమ కుటుంబసభ్యులేనన్నారు. ఎవరికి ఏ చిన్నసమస్య వచ్చినా వారిని ఆదుకోటానికి తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వెంకటెశం గుప్త, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, ఆలూర్ పిఎసిఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపిపి రాజ్యలక్ష్మి ప్రకాష్‌గౌడ్, విజయ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు జంగారెడ్డి, హన్మంతురెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసచారి, నాయకులు శేఖర్‌రెడ్డి,మధు, వెంకన్నగూడ నర్సింలు, ఆలీ, విఠలయ్య, శంకర్, తదితరులన్నారు.