హైదరాబాద్

వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్ విజేతలకు ఉచిత బిర్యానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్ పోటీలలోఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను సృష్టించి గెలిచిన వినియోగదారులకు ఏడాది పోడవున తమ రెస్టారెంట్ బిర్యానీని ఉచితంగా అందిస్తామని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అలీ హేమతి తెలిపారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ రెస్టారెంట్ ఆవరణలో వరల్డ్‌కప్ విత్ ప్యారడైజ్ పోటీల్లో గెలుపొందిన పది మంది విజేతలకు సీఈఓ గౌతమ్ గుప్తాతో కలిసి గిఫ్ట్ ఓచర్లను అందజేశారు. విజేతలకు 52 కూపన్ల బుక్‌లెట్‌ను ప్రదానం చేశారు. ఈ పోటీలో 1.4 మిలియన్ల కస్టమర్లు రిజిష్టర్ చేసుకోగా వారిలో ఎక్కువ లైక్‌లు, షేర్స్ వచ్చిన పది మందిని విజేతలుగా ప్రకటించడం జరిగిందని ఆలీ హేమతి తెలిపారు.

వైద్యులపై దాడిని ఖండించిన ఐఎంఏ
ఖైరతాబాద్, జూన్ 15: కోల్‌కత్తాలో వైద్యులపై జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ శాఖ ఖండించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తపించే వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం తీవ్ర విచారకరమని అన్నారు. ఏ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా తన వద్దకు వచ్చిన రోగి మృతి చెందాలని కోరుకోడని అన్నారు. తీవ్ర అనారోగ్యంతో, ప్రమాదాలు భారిన పడి తమ వద్దకు వచ్చే ప్రతి రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని చికిత్సలు అందిస్తారని తెలిపారు. కొన్ని సందర్భాలలో రోగి మృతి చెందితే సహనం కోల్పోయిన బంధువులు దాడులకు తెగబడటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. నిజంగా వైద్యుడు నిర్లక్ష్యం వహిస్తే చట్టప్రకారం అతనిని శిక్షించేందుకు ఎన్నో వెసులుబాటులు ఉన్నాయని అన్నారు. కోల్‌కోత్తా దాడి నేపథ్యంలో జాతీయస్థాయిలో ఈనెల 17న నిర్వహించనున్న ఒక్కరోజు నిరసన కార్యక్రమానికి తెలంగాణ శాఖ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. 17న అవుట్ పేషెంట్ సేవలను నిలుపుదల చేసి నిరసనను వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైద్యులు రవిందర్, రవిశంకర్, సురేష్, ద్వారకనాద్ రెడ్డి పాల్గొన్నారు.