హైదరాబాద్

బస్తీల్లో కిషన్‌రెడ్డి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొంది కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్‌రెడ్డి తొలిసారిగా సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం రాంగోపాల్‌పేట డివిజన్‌లోని పలు బస్తీలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారానికి తన వంతు కేంద్ర నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. విక్టోరియా గంజ్ ప్రజల కోరిక మేరకు డబుల్‌బెడ్‌రూమ్ పథకం ముందుకు సాగేలా అధికారులు, స్థానిక నేతలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడం రికార్డు అని , వంద సంవత్సరాల చరిత్ర వున్న కాంగ్రెస్ 18 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వుందన్నారు. దేశంలో ఎక్కడా ఉగ్రవాదం లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అనంతరం బీజేపీ నేత కె.దత్తరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాదయాత్రలో పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు.