హైదరాబాద్

నిబద్ధతతో పని చేస్తేనే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: నిజాయితీ నిబద్ధతతో పని చేస్తేనే సమాజం గుర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. కీర్తన ఆర్ట్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ధార్మిక పురస్కారాలతో పాటు వకుళాభరణం కృష్ణమోహన రావుకు ‘వాగ్భూషణ’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. సామాజిక జీవితం గడిపిన, గడుపుతున్న ఎందరినో ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిసున్న చరిత్ర కళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. పురస్కారాలతో సమాజంలో మరింత బాధ్యతను పెంచుతాయని తెలిపారు. సంస్థ అధ్యక్షురాలు శశిబాల చేస్తున్న కృషిని అభినందించారు. ‘స్వర బృందావనం’ పేరిట గాయనీ, గాయకులు మురళీధర్, దుర్గా ప్రసాద్, సుజారమణ, లలితారావు, హిమబాల, వాణిమాల అలపించిన గీతాలు అలరించాయి. లయన్ విజయ్ కుమార్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, బిక్కికృష్ణ పాల్గొన్నారు.
‘శ్రీ ఆంధ్రనాయక శతకం’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, జూన్ 16: ప్రముఖ రచయిత కాసుల పురుషోత్తమ కవి రచించిన ‘శ్రీ ఆంధ్రనాయక శతకం’ పుస్తకావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత ఎంతో పరిశోధన చేసి పుస్తకం రచించారని కీర్తించారు. ఆంధ్రనాయక శతకం విశిష్టత గురించి అందరికి అర్థమయ్యే రీతిలో రాయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు తొలికృతిని అందజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్.గోపీ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జానర్దన మూర్తి, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, నేటి నిజం సంపాదకుడు బైసా దేవదాసు, కవి రమణ వెలమకన్ని, ద్వాదశి శశికాంత్, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.